ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గణపయ్య ఇదేమిటయ్యా!

ABN, Publish Date - Sep 21 , 2024 | 11:41 PM

వినాయక నిమజ్జనాన్ని ఎంతో పకడ్భందీగా నిర్వహించిన అధికారులు చెరువులో వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని తొలగించడంలో విఫలమయ్యారు.

ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువులో వినాయక వ్యర్థాలు

ఘట్‌కేసర్‌ రూరల్‌, సెప్టెంబరు 21 : వినాయక నిమజ్జనాన్ని ఎంతో పకడ్భందీగా నిర్వహించిన అధికారులు చెరువులో వ్యర్థాలను, చెత్తాచెదారాన్ని తొలగించడంలో విఫలమయ్యారు. ఘట్‌కేసర్‌ మున్సిపాలిటీ, ఎదులాబాద్‌ లక్ష్మీనారాయణ చెరువులో అధికారులు వినాయక నిమజ్జనం విజయవంతంగా పూర్తి చేశారు. కానీ నిమజ్జనం పూర్తై నాలుగురోజులు గడుసున్నా చెరువులోని వ్యర్థాలను తొలగించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. వినాయకులు నీటిలో మునుగకముందే వాటిపైనే నిమజ్జనం చేయడంతో విగ్రహాలు నీటిలో తేలుతున్నాయి. నిమజ్జనంతో చెత్తచెదారం, పూజా సామగ్రి చెరువు కట్టపై దర్శనమిస్తోంది. ముందే సీజనల్‌ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో చెత్తాచెదారాన్ని తొలగించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే ఎరిమల్లేవాగు నుంచి వస్తున్న వ్యర్థాలతో ఇబ్బందులు పడుతుంటే ప్రస్తుతం వినాయక నిమజ్జనాలు చేసి ఇంకా చెరువును కలుషితం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు చెత్త చెదారాన్ని తొలగించాల్సిన మున్సిపల్‌ అధికారులు నిమజ్జనం పూర్తియ్యాక ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు. ఇప్పటికైన అధికారులు స్పందించి చెరువులోని వినాయక విగ్రహాల వ్యర్థాలను తొలగించి చెరువును పరిరక్షించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

Updated Date - Sep 21 , 2024 | 11:41 PM