ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పెబ్బేరు మార్కెట్‌ గోదాములో అగ్ని ప్రమాదం

ABN, Publish Date - Apr 02 , 2024 | 04:24 AM

వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని గోదాములో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో నిల్వ ఉన్న 12,80,000 గన్నీ బ్యాగులతో పాటు ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. బస్టాండ్‌ సమీపంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాములో ఒక్క సారిగా మంటలు

12.80 లక్షల గన్నీ బ్యాగులు, ధాన్యం బస్తాలు దగ్ధం.. 10 కోట్ల మేర ఆస్తి నష్టం

పెబ్బేరు: వనపర్తి జిల్లా పెబ్బేరు వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని గోదాములో సోమవారం సాయంత్రం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోదాంలో నిల్వ ఉన్న 12,80,000 గన్నీ బ్యాగులతో పాటు ధాన్యం బస్తాలు దగ్ధమయ్యాయి. బస్టాండ్‌ సమీపంలోని వ్యవసాయ మార్కెట్‌ యార్డు గోదాములో ఒక్క సారిగా మంటలు ఎగిసిపడి, పొగ కమ్ముకోవడంతో భయాందోళనకు గురైన ప్రజలు అధికారులకు సమాచారం ఇచ్చారు. మూడు ఫైర్‌ ఇంజన్లను వినియోగించినా.. రాత్రి 9 గంటల వరకూ మంటలు అదుపులోకి రాలేదు. గన్నీ బ్యాగులు ఎక్కువగా ఉండటం వల్ల మంటలు అదుపులోకి రాలేదని తెలుస్తోంది. గోదాముకు విద్యుత్తు సరఫరా లేనందున షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే పరిస్థితి లేదని, ప్రమాదానికి గల కారణాలు తెలియడం లేదని అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనలో రూ.10కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారెడ్డి పరిశీలించి, అధికారులతో మాట్లాడారు.

Updated Date - Apr 02 , 2024 | 04:24 AM

Advertising
Advertising