ఆ వ్యాఖ్యలు మంచివి కావు
ABN, Publish Date - Oct 02 , 2024 | 05:42 AM
మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, ప్రచారాలు సమాజానికి మంచివి కావని దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆయన మాట్లాడుతూ.. కొన్నిశక్తులు తెలంగాణ నాయకత్వాన్ని పలుచన
ఆకతాయిల చర్యలకు బీఆర్‌ఎ్‌సతో సంబంధం లేదు
దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక/కేపీహెచ్‌బీకాలనీ/రాంనగర్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి):మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలు, ప్రచారాలు సమాజానికి మంచివి కావని దుబ్బాక బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. మంగళవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో ఆయన మాట్లాడుతూ.. కొన్నిశక్తులు తెలంగాణ నాయకత్వాన్ని పలుచన చేసే కుట్రలు చేస్తున్నాయని, ఇందులో పార్టీలకు అతీతంగా అందరూ బాధితులుగానే నిలబడుతున్నారని అన్నారు. ‘ప్రజల శ్రేయస్సు కోరి.. తానే మంత్రి సురేఖను దుబ్బాకకు ఆహ్వానించాను. మంత్రి అంటే ఎంతో గౌరవం. ప్రజా జీవితంలో ఎన్నో త్యాగాలు చేయందే.. మహిళలు ఈ పదవి వరకు రాలేరు. వాళ్లపై కూడా వ్యక్తిగతం వ్యాఖ్యలు చేసే సంస్కృతి దాపురించింది. చిల్లర మనుషులు, సంస్కారం లేని వ్యక్తులు చేసే వ్యాఖ్యలను బీఆర్‌ఎ్‌సకు ఆపాదించడం మంచిది కాదు. తెలంగాణ ఉద్యమం నుంచి ఆడబిడ్డలను గౌరవించే సంస్కృతి మాది. బతుకమ్మను గౌరవించుకున్నట్టుగానే ఆడబిడ్డలను నిండు మనస్సుతో గౌరవించే పార్టీ మాది. ప్రభుత్వం స్పందించి నిందితులను అరెస్ట్ చేయాలి’ ఆయన ఆయన డిమాండ్ చేశారు. కాగా, మంత్రి కొండా సురేఖపై సోషల్ మీడియాలో చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ మంగళవారం కూకట్‌పల్లిలోని కేపీహెచ్‌బీలో కాంగ్రెస్ నాయకులు మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. మరోవైపు.. మంత్రి సురేఖపై బీఆర్‌ఎస్ నేతలు చేసిన దుష్ప్రచారం చేసినందున మాజీ మంత్రి కేటీఆర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ విద్యానగర్ చౌరస్తాలో ఆయన కాన్వాయ్‌ను యూత్ కాంగ్రెస్ గ్రేటర్ అధ్యక్షుడు మోత రోహిత్ ఆయన అనుచరులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు.
Updated Date - Oct 02 , 2024 | 05:42 AM