ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అధికార కాంగ్రెస్‌లో అసంతృప్తి!

ABN, Publish Date - Mar 26 , 2024 | 11:54 PM

కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి ముసలం బయటపడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలను ప్రోత్సహించడంపై అసంతృప్తిగా ఉన్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి టికెట్లు బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారికే కేటాయించడంపై కాంగ్రెస్‌ సీనియర్లలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కాంగ్రెస్‌ను మోసం చేసిన వారిని, దొంగలను లోపలికి తీసుకువస్తే మాలాంటి కార్యకర్తలు చచ్చిపోతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

చేవెళ్ల అత్మీయ సమావేశంలో బట్టబయలు

సీఎం ఎదుటే చేరికలపై ప్రశ్నించిన కేఎల్లార్‌

మోసగాళ్లను చేర్చుకుంటే మాలాంటి కార్యకర్తలు చచ్చిపోతారంటూ వ్యాఖ్యలు

కలకలం రేకెత్తించిన కేఎల్లార్‌ వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పార్టీలో అసమ్మతి ముసలం బయటపడింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీఆర్‌ఎస్‌ నుంచి చేరికలను ప్రోత్సహించడంపై అసంతృప్తిగా ఉన్నారు. చేవెళ్ల, మల్కాజ్‌గిరి టికెట్లు బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారికే కేటాయించడంపై కాంగ్రెస్‌ సీనియర్లలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. కాంగ్రెస్‌ను మోసం చేసిన వారిని, దొంగలను లోపలికి తీసుకువస్తే మాలాంటి కార్యకర్తలు చచ్చిపోతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డిజిల్లా ప్రతినిధి)

కాంగ్రె్‌సలో చాపకింద నీరులా ఉన్న అసమ్మతి చేవెళ్ల పార్లమెంట్‌ అత్మీయ సమావేశంలో బట్టబయలైంది. ప్రస్తుతం అఽధికార పార్టీలో చేరికలపై కాంగ్రె్‌సలో సీనియర్లు, కార్యకర్తల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. అయితే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఇప్పటి వరకు బహిరంగంగా సీనియర్‌ నేతలెవ్వరూ నోరు విప్పి మాట్లాడలేదు. కానీ లోలోపల కొందరురగిలిపోతున్నారు. చేరికల సమయంలో కనీసం తమకు సమాచారం కూడా ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరిన వారితోనే వ్యవహారాలన్నీ నడుపుతున్నారని సీనియర్లు గుర్రుగా ఉన్నారు. బీఆర్‌ఎ్‌స నుంచి చేరికలను ప్రోత్సహించడంపై అసంతృప్తిగా ఉన్న స్థానిక నేతలు బహిరంగంగా బయటపడలేదు. అయితే తాజాగా చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో మంగళవారం జరిగిన కాంగ్రెస్‌ నేతల ఆత్మీయ సమావేశంలో అసమ్మతి బట్టబయలైంది. సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేకెత్తించాయి. పార్టీ అధినాయకత్వం డోర్లు తెరుస్తామంటూ పదే పదే ప్రకటిస్తోంది. కాంగ్రె్‌సను మోసం చేసిన వారిని, దొంగలను లోపలికి తీసుకువస్తే మాలాంటి కార్యకర్తలు చచ్చిపోతారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో సీఎం రేవంత్‌రెడ్డితో పాటు స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌, చేవెళ్ల ఎంపీ అభ్యర్ధి రంజిత్‌రెడ్డి, పార్టీ ఎమ్మెల్యేల సమక్షంలో కేఎల్లార్‌ చేసిన వ్యాఖ్యలు కలకలం రేకెత్తించాయి. కేఎల్లార్‌ ఇలా మాట్లాడుతున్న సమయంలో అక్కడ ఉన్న కార్యకర్తలు పెద్ద ఎత్తున హర్ష ధ్వానాలు వ్యక్తం చేస్తూ చప్పట్లు కొట్టడం విశేషం.

అభ్యర్థిని గెలిపించుకుంటాం

ఇదిలా ఉంటే ఏదీ ఏమైనా పార్టీ టికెట్‌ ఇచ్చిన అభ్యర్థిని గెలిపించే బాధ్యత మాత్రం తీసుకుంటామని కేఎల్లార్‌ చెప్పారు. సీఎం రేవంత్‌ రెడ్డి తాను మంచి మిత్రులమని మా మధ్య విభేదాలు లేవని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టిన కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికలకు సమాయాత్తమవుతున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అత్యంత కీలకమైన చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలను కైవసం చేసుకునేందుకు అధికార కాంగ్రె్‌సతో పాటు ప్రధాన ప్రతిపక్షపార్టీలైన బీఆర్‌ఎస్‌, బీజేపీలు నువ్వా-నేనా అన్నట్లుగా తలపడుతున్నాయి. ఈ రెండు స్థానాల్లో పోటీని ఈ మూడు పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.

రెండు టికెట్లూ బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన వారికే..

అభ్యర్థుల ఎంపిక విషయంలో కాంగ్రె్‌సలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. చేవెళ్ల పార్లమెంట్‌ సీటును బీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన సిట్టింగ్‌ ఎంపీ రంజిత్‌రెడ్డికి కేటాయించారు. అలాగే మల్కాజిగిరి స్థానాన్ని బీఆర్‌ఎ్‌సలో చేరిన మాజీ మంత్రి మహేందర్‌రెడ్డి భార్య, జడ్పీ చైర్‌పర్సన్‌ సునీతారెడ్డికి ప్రకటించారు. ఈ రెండు సీట్లు బీఆర్‌ఎఎస్‌ నుంచి వచ్చిన వారికే కేటాయించడంపై కాంగ్రెస్‌ సీనియర్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కాంగ్రెస్‌ ఉనికి లేకుండా చేయాలనుకున్న నేతలకు ఇప్పుడు కాంగ్రెస్‌ పిలిచి టికెట్లు ఇవ్వడంపై కొందరు నేతలు, కార్యకర్తలు అసంతృప్తితో ఉన్నారు. చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో సీనియర్‌ నేతలు తమపై కేసులు పెట్టిన వారికి ఇప్పుడు ఎలా పనిచేయాలని ప్రశ్నిస్తున్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని గుర్తించకుండా అధికారం ఎక్కడ ఉంటే అక్కడ ఉండే వారిని పిలిచి టికెట్లు ఇవ్వడమేమిటనీ అడుగుతున్నారు. అయితే ఇప్పుటి వరకు బహిరంగంగా నెతలెవ్వరూ దీనిపై మాట్లాడలేదు.

సమావేశాలను పట్టించుకోని అసంతృప్త నేతలు

అసంతృప్తిగా ఉన్న నేతలు స్థానికంగా జరిగే సమావేశాలను కూడా పెద్దగా పట్టించుకోవడం లేదు. నిన్నమొన్నటి వరకు బద్దవిరోధులుగా ఉండి తమపై కేసులు పెట్టించిన వారి కోసం ఇప్పుడు పనిచేయాలా? అని ప్రశ్నిస్తున్నారు. అయితే అదను చూసి అందరి సమక్షంలోనే కేఎల్లాఆర్‌ ఈఅంశాన్ని లేవనెత్తడం చర్చనీయాంశంగా మారింది. తరువాత మాట్లాడిన సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ నాయకత్వం నిర్ణయం ప్రకారమే టికెట్లు కేటాయింపు ఉంటుందని పనిచేసే కార్యకర్తలు, నేతలకు న్యాయం జరుగుతుందని హామీ ఇస్తూ ఇటీవల ఉమ్మడి జిల్లానేతలకు నామినేటెడ్‌ పోస్టుల కేటాయింపును గుర్తు చేశారు.

Updated Date - Mar 26 , 2024 | 11:57 PM

Advertising
Advertising