ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

డిండి ప్రాజెక్టు నీటి విడుదల

ABN, Publish Date - Dec 12 , 2024 | 01:08 AM

డిండి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఆరు తడి పంటలు కోసం నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాస్‌ బుధవారం విడుదల చేశారు.

నీటిని విడుదల చేస్తున్న నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాస్‌, రైతులు

డిండి, డిసెంబరు 11(ఆంధ్రజ్యోతి): డిండి ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో ఆరు తడి పంటలు కోసం నీటిపారుదలశాఖ డీఈ శ్రీనివాస్‌ బుధవారం విడుదల చేశారు. ఈ యాసంగిలో ప్రాజెక్టు పరిధిలోని 12,750 ఎకరాలు సాగులోకి రాను డగా కుడి కాల్వ పరిధిలో 250, ఎడమ కాల్వ పరిధిలో 12,500 ఎకరాలకు సాగు నీరు అందనుంది. సుమారు 6వేల మంది రైతులకు ప్రయోజనం కలుగ నుంది. ప్రాజెక్టు చివరిలో ఉన్న దేవరకొండ మండలం తెలుగుపల్లి గ్రామపరిధిలో ఉన్న 250 ఎకరాలకు కూడ సాగునీరు అందనుంది. ప్రధాన కాల్వ ద్వారా గోనకోలు, డిండి, బొగ్గులదొన గ్రామాల పరిధిలోని 1,200 ఎకరాలు, నార్త్‌, ఈస్ట్‌ పరిధిలో 6వేల ఎకరాలు, నార్త్‌ వెస్ట్‌ పరిధిలో 4వేల ఎకరాలకు సాగునీరు అంద నుంది. 2023 వానకాలం ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వ కింద 12,750 ఎకరాలు సాగు లోకి వచ్చింది. ప్రస్తుతం ప్రాజెక్టు గరిష్టనీటిమట్టం 36 అడుగులు(2.4 టీఎం సీలు) కాగా ప్రస్తుతం నీటి నిల్వ గరిష్టస్థాయి 36 అడుగులతో నిండి ఉంది. ఈ నీటితో యాసంగి సాగుచేసే పంటలకు పూర్తిగా సరిపోతుందని అధికారులు తెలి పారు. నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో డి.వెంక టేశ్వర రావు, తిప్పర్తి రుక్మారెడ్డి, బాదమోని శ్రీనివాస్‌గౌడ్‌, కుర్మారెడ్డి, శైలేజ్‌, శశిధర్‌రెడ్డి, వర్కింగ్‌ ఇన్‌స్పెక్టర్‌ కర్ణాకర్‌, సాయి పాల్గొన్నారు.

Updated Date - Dec 12 , 2024 | 01:08 AM