అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి : మంత్రి ఉత్తమ్
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:51 AM
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు.
హుజూర్‌నగర్, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి) : అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆదేశించారు. శనివారం హైద్రాబాద్‌లోని మంత్రి నివాసంలో మున్సిపల్ వైస్‌ఛైర్మన్ సంపత్‌రెడ్డి, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ మాట్లాడుతూ ఫణిగిరి గట్టు వద్ద నిర్మాణంలో ఉన్న ఇళ్ళను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. హుజూర్‌నగర్ బైపాస్ పనులు వేగవంతం చేయాలన్నారు. చింతలబజారు బీటీ రోడ్డు పనులు పూర్తిచేయాలని, ఔటర్ రింగ్‌రోడ్డు మొత్తం పూర్తిచేయాలని ఆదేశించారు. రవాణా సౌకర్యం మెరుగు పర్చాలన్నారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలన్నారు. గోవిందాపురం బ్రిడ్జినిర్మాణ పనులు పూర్తిచేయాలన్నారు. అభివృద్ధి పనుల్లో నాణ్యత లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో చంద్రశేఖర్, వీరారెడ్డి, వెంకటరెడ్డి, చంద్రారెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 12:51 AM