ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పంట నష్టం పరిహారమేదీ?

ABN, Publish Date - Apr 01 , 2024 | 05:59 AM

అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసి న పంటలు అకాలవర్షానికి నేలపాలయ్యాయి. వడగళ్ల వానలు, ఈదురుగాలులు పంటలను అతలాకుతలం చేశాయి. రైతన్న వేదనను చూసిన ప్రభుత్వం.. వారికి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నష్టపోయిన

ఏడాదిగా ఎదురుచూస్తున్న రైతన్నలు..

గతేడాది మార్చి, ఏప్రిల్‌లో 1,51,545 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు

ఎకరాకు రూ.10 వేల పరిహారం ఇస్తామన్న గత ప్రభుత్వం

నేటికీ అందని రెండో విడత పంట నష్టపరిహారం

కాంగ్రెస్‌ ప్రభుత్వమైనా ఇవ్వాలని రైతుల వేడుకోలు

జనగామ/జగిత్యాల, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): అన్నదాతలు ఆరుగాలం శ్రమించి సాగు చేసి న పంటలు అకాలవర్షానికి నేలపాలయ్యాయి. వడగళ్ల వానలు, ఈదురుగాలులు పంటలను అతలాకుతలం చేశాయి. రైతన్న వేదనను చూసిన ప్రభుత్వం.. వారికి పంట నష్టపరిహారం ఇచ్చి ఆదుకుంటామని హామీ ఇచ్చింది. నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.10 వేల చొప్పున ఇస్తామని చెప్పింది. కానీ, ఏడాది కాలం గడిచిపోతున్నా.. ఇప్పటికీ రైతులకు పరిహారం అందలేదు. ఇంకా వారికి ఎదురుచూపు తప్పలేదు. గతేడాది మార్చి, ఏప్రిల్‌ నెలల్లో కురిసిన అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా అధిక విస్తీర్ణంలో వరి, మామిడి, మొక్కజొన్న తదితర పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కోత దశకు వచ్చిన పంట కావడంతో వడగళ్ల దెబ్బకు గింజలన్నీ నేలరాలి రైతులకు కడగళ్లను మిగిల్చాయి. అధికారుల ద్వారా పంటనష్టం వివరాలను తెప్పించుకున్న నాటి ప్రభుత్వం.. నష్టపోయిన రైతులందరికీ పరిహారం చెల్లిస్తామని చెప్పినా.. కేవలం మార్చి నెలకు సంబంధించిన పరిహారాన్ని మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. అయితే మార్చి నెలలో జరిగిన నష్టం కన్నా ఏప్రిల్‌లో రెట్టింపు నష్టం సంభవించింది. కానీ, ఏప్రిల్‌లో జరిగిన నష్టానికి సంబంధించిన పరిహారాన్ని మాత్రం రైతులకు నేటికీ ఇవ్వలేదు. ఇందుకోసం రూ.151.54 కోట్లు విడుదల చేస్తున్నట్లు ఆనాడు ప్రకటించినా రైతుల ఖాతాల్లో మాత్రం జమ కాలేదు.

రెండు లక్షల ఎకరాల్లో పంట నష్టం..

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 2.28 లక్షల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లిందన్న విషయాన్ని నాడు ఖమ్మం జిల్లాలో పంటల పరిశీలన సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందులో మొక్కజొన్న 1,29,446 ఎకరాలు, వరి 72,709 ఎకరాలు, మామిడి 8,865 ఎకరాల్లో నష్టపోయిందని పేర్కొన్నారు. గతేడాది మార్చి 23న ఖమ్మం, వరంగల్‌, మహబూబాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో కేసీఆర్‌ పర్యటించి నష్టపోయిన పంటలను పరిశీలించారు. ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా పంటనష్టం జరిగిన 26 జిల్లాల్లో వ్యవసాయాధికారులు సర్వే నిర్వహించి 1,51,545 ఎకరాల్లో నష్టం జరిగినట్లు తేల్చారు. దీనికి సంబంధించి ఎకరానికి రూ.10 వేల చొప్పున రూ.151.54 కోట్లు విడుదల చేస్తున్నట్లు గతేడాది జూన్‌లో కేసీఆర్‌ సర్కారు ప్రకటించింది. మొత్తం 1,30,988 మంది రైతులు పరిహారానికి అర్హులుగా పేర్కొంది. అయితే మార్చి నెల పరిహారాన్ని మాత్రమే రైతుల ఖాతాల్లో జమ చేసింది. కాగా, జగిత్యాల జిల్లాలో గతేడాది మార్చి, ఏప్రిల్‌తోపాటు జూలైనూ కలిపి 73,686 ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిన్నా యి. ఇందులో మార్చిలోనే 6,199 ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. కేవలం 532 ఎకరాలకే పరిహారం చెల్లించారు. ఏప్రిల్‌లో 52 వేల ఎకరాల్లో, జూలైలో భారీ వర్షాలకు 15,487 ఎకరాల్లో పంటనష్టం వాటిల్లగా.. ఇప్పటివరకు పరిహారం ఇవ్వలేదు. మొత్తంగా రెండో విడతకు సంబంధించి 20,160 మంది రైతులకు పరిహారం కింద రూ.36.69 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఆర్థిక శాఖలో పెండింగ్‌..

రెండో విడత పంట నష్టం పరిహారానికి సంబంధించిన నిధులు ఆర్థికశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వంలో 2 విడతలకు సంబంధించి రూ.151.54 కోట్లు విడుదల చేయగా వాటికి ఫైనాన్స్‌ క్లియరెన్స్‌ లభించలేదని అధికారులు చెబుతున్నారు. క్లియరెన్స్‌ వస్తే నేరుగా రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యే అవకాశముంది. దీనిపై కొత్త ప్రభుత్వం దృష్టి సారించాలని రైతులు కోరుతున్నారు.

ఏడు ఎకరాల్లో పంట నష్టపోయాను

గతేడాది యాసంగిలో ఏడెకరాల్లో వరి పంట సాగు చేస్తే వడగళ్లు, ఈదురుగాలుల కారణంగా పంటంతా నాశనమైంది. చేతికొచ్చిన గింజలన్నీ చేలోనే రాలిపోయి ఏమీ చేతికిరాలేదు. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు. అధికారులు సర్వే చేసి పంట నష్ట పరిహారం అందిస్తామని చెప్పారు. కానీ, ఏడాది దాటుతున్నా ఒక్క పైసా పరిహారం రాలేదు. అధికారులను అడిగితే ప్రభుత్వం వద్దే పైసలు ఆగిపోయాయని చెబుతున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి పరిహారాన్ని అందించాలి. - గొడ్డేటి రాజు, గానుగుపహాడ్‌, జనగామ జిల్లా

Updated Date - Apr 01 , 2024 | 05:59 AM

Advertising
Advertising