ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పెండింగ్‌ పనులను పూర్తి చేయండి

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:17 PM

పట్టణంలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని దేవర కద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు.

అభివృద్ధి పనులపై అధికారులతో మాట్లాడుతున్న ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

- దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి

- పలు అభివృద్ధి పనుల పరిశీలన

- పలువురు లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ

కొత్తకోట, జనవరి 18: పట్టణంలో నిర్మాణంలో ఉన్న అభివృద్ధి పనులను పూర్తి చేయాలని దేవర కద్ర ఎమ్మెల్యే మధుసూదన్‌రెడ్డి అధికారులను ఆ దేశించారు. బిల్లులు ఇప్పించడంలో ఎలాంటి జా ప్యం లేకుండా చూస్తామని పేర్కొన్నారు. గురువా రం పట్టణంలో ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశా రు. అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న కొత్త కాలువ (డ్రైనేజీ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల భవనం, ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ భవన సముదాయం, సంత బజార్‌ స్థలం, 30 పడకల ఆస్పత్రికి కేటాయించిన స్థలాన్ని మునిసిపల్‌, పంచాయతీ, విద్య, ఆరోగ్య, విద్యుత్‌, రెవెన్యూ శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మా ట్లాడుతూ ప్రభుత్వ ఉన్నతపాఠశాలలో నిర్మాణ మైన తరగతిగదుల కొద్దిపాటి పనులు పూర్తి చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని, పక్షం రోజుల్లో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోండని ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బాలికల పాఠశాల బాత్‌ రూం పనులు పూర్తి చేయాలని, పాఠశాల దగ్గరలో ఉన్న 11 కేవీ విద్యుత్‌ ట్రాన్స్‌ ఫార్మరు వద్ద భద్రత చర్యలు చేపట్టండని ట్రాన్స్‌కో ఏఈకి చెప్పారు. మార్కెట్‌, డ్రైనేజీ, సంతస్థలం అభివృద్ధి పనులు త్వరితగతిన చేసేందుకు అధికా రులు కాంట్రాక్టర్లతో మాట్లాడాలని సూచించారు. 30 పడకల ఆస్పత్రి నిర్మాణానికి నిధులు తక్కువ గా కేటాయించడంతో టెండరు వేయడానికి ఎవరూ ముందుకు రాలేదని తెలిసిందని అధికారు లు మళ్లీ అంచనాలు సిద్ధం చేస్తే నిధులు మం జూరు చేయిస్తానన్నారు.

లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ ..

మండల పరిషత్‌ కార్యాలయంలో కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్‌, రైతుబీమా చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ కమిషనరు శ్రీనివాస్‌, తహసీల్దార్‌ బాల్‌రెడ్డి, ఎంఈవో కృష్ణయ్య, డీఈ నాగేశ్వర్‌రావు, ఏవో షేక్‌ మున్న, మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ సుకేశిని కౌన్సిలర్లు పద్మ, సంధ్య, ఎంపీటీసీ సభ్యురాలు రాధ సర్పంచులు శేఖర్‌రెడ్డి, లత, విశ్వనాథం, శివరాజ్‌, రామచంద్రయ్య, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బీచుపల్లి యాదవ్‌, ప్రశాంత్‌, గొల్లబాబు, చంద్రశేఖర్‌రెడ్డి, సత్యారెడ్డి, డాక్టర్‌ పీజే. బాబు, కర్ణాకర్‌రెడ్డి, బోయోజ్‌, కృష్ణారెడ్డి, సురేందర్‌ రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, నరేందర్‌రెడ్డి, మాసన్న, లతీఫ్‌, మిషేక్‌, సాయులు యాదవ్‌, పెంటన్న, శివరాము లు, మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికలలో ఇచ్చిన హామీలు నెరవేరుస్తాం

మదనాపురం: కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ లను కచ్చితంగా నెరవేరుస్తామని ఎమ్మెల్యే జి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలో కల్యాణలక్ష్మి, రైతుబీమా చెక్కులను 34 మంది లబ్ధిదారులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జన్నుపద్మావతి, వైస్‌ ఎంపీపీ యాదమ్మ, తహసీల్దార్‌ అబ్రహాంలింకన్‌, మండల వ్యవసాయ అధికారి షేక్‌మున్నా, సర్పంచులు రాంనారాయణ, శ్రావణి, నాయకులు కృష్ణవర్ధన్‌ రెడ్డి, జగదీష్‌, మహేష్‌కుమార్‌, రామకృష్ణ, రాజవర్ధన్‌రెడ్డి, నాగ రాజుగౌడ్‌, వెంకటస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:17 PM

Advertising
Advertising