సీఎం కప్ 2024ను పకడ్బందీగా నిర్వహించాలి
ABN, Publish Date - Dec 10 , 2024 | 12:32 AM
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తలపెట్టిన సీఎం కప్ 2024ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిం చాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం కప్ 2024 సందర్బంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించి స మీక్షించారు.
జగిత్యాల, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మ కంగా తలపెట్టిన సీఎం కప్ 2024ను జిల్లాలో పకడ్బందీగా నిర్వహిం చాలని స్థానిక సంస్థల జిల్లా అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో సీఎం కప్ 2024 సందర్బంగా జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించి స మీక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడారు. క్రీడల నిర్వహణ గు రించి అధికారులకు దిశ నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో జిల్లా యు వజన మరియు క్రీడల అధికారి డాక్టర్ కోరుకంటి రవి కుమార్ జిల్లా అదనపు ఎస్‌పీ ఎం.బీ రావు, డీఈఓ రాము, పరిశ్రమల శాఖ ప్రతినిధి మధులత, మున్సిపల్ కమిషనర్ చిరంజీవి, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరే షన్ కార్యదర్శి లక్ష్మీరామ్, జిల్లా ఒలంపిక్ కార్యదర్శి ఏలేటి ముత్తయ్య రెడ్డి పాల్గొన్నారు.
జగిత్యాలరూరల్ : జగిత్యాల రూరల్ మండలంలోని అంతర్గాం జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో సోమవారం సీఎం కప్ పోటీలను ప్రదానో పాధ్యాయులు శ్రీసింగ్ సత్తయ్య ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు ప్రతిభ కనబరిచి జిల్లాస్ధాయి, రాష్ట్ర స్ధాయిలో రాణించాల న్నారు. ఈకార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరజనీకర్‌రెడ్డి, ఎండీ ఫక్రు ద్దీన్, ఫిజికల్ డైరెక్టర్ కొండపల్కల కోటేశ్వర్‌రావు, పాల్గొన్నారు.
Updated Date - Dec 10 , 2024 | 12:32 AM