బుద్ధవనం ప్రవేశ టికెట్ ధరల పెంపు
ABN, Publish Date - Apr 02 , 2024 | 12:09 AM
అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఉన్న బుద్ధవనం ప్రవేశ టికెట్ ధరలు ఈ నెల 1వ తేదీ నుంచి పెంచినట్లు బుద్ధవనం అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.
కెమెరా వినియోగిస్తే రూ.25, వీడియో కెమెరా రూ.10వేలు
కాన్ఫరెన్స్ హాల్ వినియోగానికి రోజుకు రూ.10వేలు
నాగార్జునసాగర్, ఏప్రిల్ 1: అంతర్జాతీయ బౌద్ధ క్షేత్రమైన నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో ఉన్న బుద్ధవనం ప్రవేశ టికెట్ ధరలు ఈ నెల 1వ తేదీ నుంచి పెంచినట్లు బుద్ధవనం అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. టికెట్ ధరలు పెద్దలకు రూ.100(గతంలో 50), 12సంవత్సరాలలోపు పిల్లలకు రూ.50(గతంలో రూ.30), విదేశీ పర్యాటకులకు రూ. 300లుగా నిర్ణయించారు. ఫోటో కెమెరాను ఉపయోగించినట్లయితే రూ. 25లు, ఒక రోజు వీడియో కెమెరాను వినియోగిస్తే రూ. 10వేలు, కాన్ఫరెన్స్ హాలుకు ఒకరోజుకు రూ. 10వేలుగా ధరలు నిర్ణయించారు. పాఠశాల, కళాశాలల విద్యార్థులకు ఆయా విద్యాసంస్థల లెటర్ ప్యాడ్‌లను తీసుకువస్తే టికెట్ ధరలో 50శాతం రాయితీని కల్పించనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. మాంక్‌లు, బౌద్ధ భిక్షువులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నామని అధికారులు తెలిపారు.
Updated Date - Apr 02 , 2024 | 12:09 AM