BRS MLAs : లీకులిచ్చి వార్తలు రాయించుకుంటున్న సీఎం
ABN, Publish Date - Dec 18 , 2024 | 05:25 AM
కేసులు, అరెస్టులని లీకులిచ్చి వార్తలు రాయించుకుంటూ ముఖ్యమంత్రి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద
బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు
కేసులు, అరెస్టులని లీకులిచ్చి వార్తలు రాయించుకుంటూ ముఖ్యమంత్రి వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు జగదీశ్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కేపీ వివేకానంద అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ ఆరోపించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో కేటీఆర్‌ను ఇరికించేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని, ఎలాంటి విచారణకైనా కేటీఆర్ సిద్ధమని వారు పేర్కొన్నారు. లగచర్ల రైతులు జైల్లో మగ్గుతుంటే సీఎం, మంత్రులు రాక్షసానందం పొందుతున్నారని విమర్శించారు.
Updated Date - Dec 18 , 2024 | 05:25 AM