నాణ్యమైన ధాన్యం తెచ్చి మద్దతు ధర పొందాలి
ABN, Publish Date - Oct 27 , 2024 | 12:49 AM
రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని తహసీల్దార్ అమీన్‌సింగ్ అన్నారు.
మద్దిరాల, అక్టోబరు 26(ఆంధ్రజ్యోతి): రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకొచ్చి మద్దతు ధర పొందాలని తహసీల్దార్ అమీన్‌సింగ్ అన్నారు. మహిళా సమాఖ్య కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు మద్దిరాలలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీవో సత్యనారాయణరెడ్డి, ఏపీఎం మైసయ్య, సీసీ నాగార్జున్‌రెడ్డి, బత్తుల వెంకన్న పాల్గొన్నారు.
నూతన్‌కల్, అక్టోబరు 26 (ఆంధ్రఽజ్యోతి): దాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు అన్ని వసతులు కల్పించాలని తహాసిల్థార్ శ్రీనివాస్‌రావు కోరారు. శనివారం మండల కేంద్రంతో పాటు, ఎర్రపహాడ్ గ్రామంలో కొనుగోలు కేంద్రాలను సందర్శించి మాట్లాడారు. రైతుల దాన్యం కాంటాలు కాగానే ట్యాబ్ ఎంట్రీ పూర్తి చేయాలని నిర్వహాకులను కోరారు. ఆయన వెంట ఎంపిడివో సునీత, ఏవో మురళిబాబు, నిర్వహాకులు ఉన్నారు.
మోతె, అక్టోబరు 26 (ఆంధ్రఽజ్యోతి): ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కీసర సంతోష్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని రాఘవాపురం, కొత్తగూడెం, అన్నారిగూడెం గ్రామాల్లో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి మాట్లాడారు. కేంద్రం నిర్వాహకులు రైతులను ఇబ్బందులకు గురిచేయకుండా కాంటాలు త్వరితగతిన వేయాలన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం వెంకయ్య పాల్గొన్నారు.
కోదాడ రూరల్, అక్టోబరు 26 (ఆంధ్రఽజ్యోతి): రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తూమాటి వరప్రసాద్‌రెడ్డి అన్నారు. శనివారం మండలంలోని యర్రవరం, రామలక్ష్మీపురం, బీక్యాతండా గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు.రైతులు తొందరపడి దళారులకు తక్కువ రేటుకు అమ్మి మోసపోవద్దన్నారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ నలజాల శ్రీనివాసరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకటాచారి, ఇర్ల సీతారాంరెడ్డి, సింగిల్ విండో వైస్ చైర్మన్ సుభాష్‌రెడ్డి పాల్గొన్నారు.
Updated Date - Oct 27 , 2024 | 12:49 AM