ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా బొక్క నర్సింహారెడ్డి

ABN, Publish Date - Jan 19 , 2024 | 11:03 PM

రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బొక్క నర్సింహారెడ్డిని ఆ పార్టీ నియమించింది. నర్సింహారెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఇది వరుసగా నాలుగోసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామయం చేపట్టింది.

వరుసగా నాల్గోసారి వరించిన పదవి

రంగారెడ్డి అర్బన్‌, జనవరి 19 : రంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా బొక్క నర్సింహారెడ్డిని ఆ పార్టీ నియమించింది. నర్సింహారెడ్డి ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక కావడం ఇది వరుసగా నాలుగోసారి లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో మెజారిటీ సీట్లే లక్ష్యంగా ముందుకెళుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుల నియామయం చేపట్టింది. దీనిలో భాగంగానే బొక్క నర్సింహారెడ్డికి మరోసారి అవకాశం దక్కింది. వరుసగా ఆయనను నాలుగో సారి జిల్లా అధ్యక్ష పదవి వరించింది. నర్సింహారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, ఆ తర్వాత ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2016 నుంచి నేటి వరకు జిల్లా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి తనపై నమ్మకం ఉంచి మరోసారి పార్టీ అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, రానున్న ఎంపీ ఎన్నికల్లో పార్టీ జెండాను ఎగరవేసేలా సమన్వయంతో ముందుకు సాగనున్నట్లు తెలిపారు. తనకు జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 19 , 2024 | 11:03 PM

Advertising
Advertising