ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

బీజేపీలోని దద్దమ్మల వల్లే ఆ పార్టీని వీడా

ABN, Publish Date - Apr 02 , 2024 | 04:29 AM

ఎన్నో ఏళ్లుగా బీజేపీలో వెట్టిచాకిరి చేసినా గుర్తింపు లభించకపోవడంతో పాటు కొందరు దద్దమ్మలు, చవటల పనీతీరు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేశానని ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు

బాబూమోహన్‌

హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్‌ 1: ఎన్నో ఏళ్లుగా బీజేపీలో వెట్టిచాకిరి చేసినా గుర్తింపు లభించకపోవడంతో పాటు కొందరు దద్దమ్మలు, చవటల పనీతీరు నచ్చకనే ఆ పార్టీకి రాజీనామా చేశానని ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బాబూమోహన్‌ అన్నారు. ఆయన పార్టీ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆశీస్సులతో లోక్‌సభ ఎన్నికల్లో వరంగల్‌ నుంచి బరిలో దిగుతున్నానని చెప్పారు. వరంగల్‌ బిడ్డగా, 25 ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన తనను గెలిపిస్తే కాజీపేట కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. ప్రజాశాంతి పార్టీ ఆధ్వర్యంలో కేఏ పాల్‌ సొంత నిధులతో పేద విద్యార్థులకు ఉచిత విద్య, వైద్యంతోపాటు వితంతువులకు, వృద్ధులకు పెన్షన్లను అందిస్తామని హామీనిచ్చారు.

Updated Date - Apr 02 , 2024 | 04:30 AM

Advertising
Advertising