Kumaram Bheem Asifabad- ఆత్రం సక్కు గెలుపు కోసం పాటుపడాలి
ABN, Publish Date - Mar 21 , 2024 | 10:56 PM
ఆదిలాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం కార్యకర్తలు పాటుపడాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కార్యకర్తలతో మాట్లాడారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు పెన్షన్ అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు.
బెజ్జూరు, మార్చి 21: ఆదిలాబాద్ బీఆర్‌ఎస్ ఎంపీ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం కార్యకర్తలు పాటుపడాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో కార్యకర్తలతో మాట్లాడారు. గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలతో పాటు పెన్షన్ అందించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది వైద్యులు లేక పోవడంతో వైద్యం అందడం లేదని ఎమ్మెల్సీ దృష్టికి తీసుకు వెళ్లారు. తక్షణమే కలెక్టర్‌తో పోన్‌లో మాట్లాడి ఆస్పత్రిలో వైద్యులను నియమించేలా చూడాలని కోరారు. ఆయన వెంట జడ్పీటీసీ పుష్పలత, నాయకులు శ్యాంరావు, శమీయుద్దీన్, రాజన్న, ఖాజా మొయినుద్దీన్, రాజేష్, అమృత తదితరులు పాల్గొన్నారు.
పెంచికలపేట: బీఆర్‌ఎస్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సక్కు గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిల్లా పని చేయాలని ఎమ్మెల్సీ దండె విఠల్ అన్నారు. మండల కేంద్రంలో గురువారం బీఆర్‌ఎస్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఆర్‌ఎస్‌పీ ప్రవీణ్‌కుమార్ ఆధ్వర్యంలో కార్యకర్తల సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీ సత్తా చాటుతుందన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు ప్రతీ ఒక్కరికి అందాయని చెప్పారు. రైతుల శ్రేయస్సు కోసం రైతుబంధు, రైతు భీమా పథకాలు అందించిన ఘనత కేసీఆర్‌దే అని తెలిపారు. ప్రజలకు వీటిపై కార్యకర్తలు వివరించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, మహేష్, లహన్‌రాజ్, రమేశ్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Mar 21 , 2024 | 10:57 PM