టీఎ్‌సపీఎస్సీ పరీక్షలన్నీ రద్దు చేయాలి
ABN, First Publish Date - 2024-02-06T00:39:00+05:30
టీఎ్‌సపీఎస్సీ గత బో ర్డు నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేయాలని నిరుద్యోగు లు కోరారు.
టీఎ్‌సపీఎస్సీ పరీక్షలన్నీ రద్దు చేయాలి
నల్లగొండటౌన, ఫిబ్రవరి 5: టీఎ్‌సపీఎస్సీ గత బో ర్డు నిర్వహించిన పరీక్షలన్నీ రద్దు చేయాలని నిరుద్యోగు లు కోరారు. జిల్లాకేంద్రంలో సోమవారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి గ్రంథాలయం నుంచి వచ్చిన నిరుద్యోగులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మం త్రితో నిరుద్యోగులు మాట్లాడుతూ పేపర్ లీకేజీ తర్వాత నిర్వహించిన టీఎ్‌సపీఎస్సీ పరీక్షలు అన్నింటినీ రద్దు చే యాలని, అమ్ముకున్న పోస్టులకు ఫలితాలు ఇవ్వడం ఏ మిటని వారు పేర్కొన్నారు. గ్రూప్-1 పోస్టులు పెంచాల ని, గ్రూ ప్-2, గ్రూప్-3 తేదీలు ప్రకటించాలని, వెంటనే జాబ్ క్యాలెండరు విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 20వేల టీచర్ పోస్టులను, అదేవిధంగా పీఈటీ, పీడీ పోస్టులను భర్తీ చేయాలని మంత్రిని కోరా రు. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో తిష్ట వేసిన సమస్యలను కూ డా ఆయన దృష్టికి తీసుకెళ్లారు. గ్రంథాలయాన్ని వెంటనే సందర్శించాలని నిరుద్యోగుల జేఏసీ కోరారు. కార్యక్రమంలో గ్రంథాల య నిరుద్యోగ జేఏసీ అధ్యక్షుడు నీలం వెంకన్న, జేఏసీ నాయకు లు జానయ్య, హరీష్, శ్రవణ్, సత్యం, చందు, రామకృష్ణ, నాగరాజు, ప్రవీణ్, అంజలి, మమత, సంతోష, నీలిమ పాల్గొన్నారు.
Updated Date - 2024-02-06T00:39:02+05:30 IST