డంపింగ్‌యార్డు సమస్యను పరిష్కరించాలి
ABN, Publish Date - Apr 01 , 2024 | 10:23 PM
పట్టణంలోని ఆండాళమ్మ కాల నీలో ఏర్పాటు చేసిన మున్సిపల్ డంపింగ్‌యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించా లని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ హన్మంతరెడ్డి, బోర్డు అధి కారి లక్ష్మీప్రసాద్‌లు అన్నారు.
ఏసీసీ, ఏప్రిల్ 1: పట్టణంలోని ఆండాళమ్మ కాల నీలో ఏర్పాటు చేసిన మున్సిపల్ డంపింగ్‌యార్డు వల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించా లని రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డు జాయింట్ చీఫ్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజనీర్ హన్మంతరెడ్డి, బోర్డు అధి కారి లక్ష్మీప్రసాద్‌లు అన్నారు. ఆండాళమ్మ కాలనీ ప్రజ లు డంపింగ్ యార్డు వల్ల అనారోగ్యాల బారిన పడు తున్నారని ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా కన్వీనర్ నయీం పాషా సెప్టెంబరులో జాతీయ హరిత ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశాడు. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు తెలం గాణ పొల్యూషన్ బోర్డు, మంచిర్యాల కలెక్టర్, మున్సిప ల్ కమిషనర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేయగా కమిటీ సభ్యులు సోమ వారం ఆండాళమ్మ కాలనీ సమీపంలోని డంపింగ్ యార్డును పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. చెత్తను కాల్చడం వల్ల పొగ, దుమ్ముధూళితో శ్వాసకోశ వ్యాధులకు గురై అనారోగ్యం బారిన పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు మున్సిపల్ కమిషనర్‌ను వివరణ అడగగా సింగరేణి నుంచి 25 ఎకరాల భూమిని కేటాయిస్తారని, భూమిని కేటాయించిన వెంటనే ఇక్కడి నుంచి తరలిస్తామ న్నారు. అదనపు కలెక్టర్‌ను కంట్రోల్ బోర్డు అధికారు లు సంప్రదించగా పది రోజుల్లో సమస్యను పరిష్కరి స్తామని సింగరేణి భూమి కేటాయింపు తది దశలో ఉందని తెలిపినట్లు సమాచారం.
Updated Date - Apr 01 , 2024 | 10:23 PM