ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bhim Asifabad: జిల్లాలో బంద్‌ సంపూర్ణం.. ప్రశాంతం

ABN, Publish Date - Sep 21 , 2024 | 10:23 PM

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 21: జైనూరు మండ లంలో ఆదివాసీమహిళపై అత్యాచారయత్నం, హత్యా యత్నం చేసిన నిందితున్ని ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాలు శనివారం రాష్ట్రబంద్‌కు పిలుపునివ్వగా జిల్లాకేంద్రంలో బంద్‌ సంపూర్ణంగా, ప్రశాం తంగా జరిగింది.

- నిందితున్ని కఠినంగా శిక్షించాలని ఆదివాసీ సంఘాల డిమాండ్‌

- పోలీసుల పటిష్ఠ బందోబస్తు

ఆసిఫాబాద్‌రూరల్‌, సెప్టెంబరు 21: జైనూరు మండ లంలో ఆదివాసీమహిళపై అత్యాచారయత్నం, హత్యా యత్నం చేసిన నిందితున్ని ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ తుడుందెబ్బ, ఆదివాసీ సంఘాలు శనివారం రాష్ట్రబంద్‌కు పిలుపునివ్వగా జిల్లాకేంద్రంలో బంద్‌ సంపూర్ణంగా, ప్రశాం తంగా జరిగింది. జిల్లాకేంద్రంలోని వ్యాపార, వాణిజ్యసము దాయాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించి మద్దతు తెలిపారు. ప్రైవేటు పాఠశాలలకు ముందస్తుగా సెలవులు ప్రకటించగా ప్రభుత్వ పాఠశాలలను ఆదివాసీ సంఘాల నాయకులు వెళ్లి మూసి వేయించారు. ఆర్టీసీ బస్సులు కూడా అరకొరగా నడిచాయి. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. బంద్‌ నేపథ్యంలో పోలీసులు పటిష్ఠ బందోబస్తు నిర్వహించారు. ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డీఎస్పీలు కరుణాకర్‌, రామనుజం నేతృత్వంలో సీఐసతీష్‌, ఎస్సైలు రాజేశ్వర్‌ ఆధ్వర్యంలో పోలీసులుబలగాలతో బందో బస్తు నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ జిల్లా అధ్యక్షుడు కోవ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌చౌక్‌, కుమరం భీం చౌక్‌లో నిరసన వ్యక్తంచేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీ మహిళపై అఘా యిత్యానికి పాల్పడిన నిందితుడికి వెంటనే ఉరిశిక్ష వేయిం చాలని డిమాండ్‌ చేశారు. ఆదివాసీ చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని డిమాండ్‌చేశారు. 1970తర్వాత ఏజెన్సీ లోకి వచ్చిన గిరజనేతరులను మైదానప్రాంతాలకు పంపిం చాలని ఆదివాసీ భూములను కబ్జాచేసి పట్టాలు పొందిన వారందరిపై చర్యలు తీసుకొని తిరిగి ఆదివాసీలకు ఆ భూములను అప్పగించాలని డిమాండ్‌ చేశారు. కార్యక్ర మంలో ఆదివాసీ సంఘాల నాయకులు రాజ్‌కుమార్‌, తిరుపతి, భీంరావు, రాంకిషన్‌, బాలు తదితరులు పాల్గొన్నారు.

మండలాల్లో..

బెజ్జూరు/వాంకిడి/కెరమెరి: జైనూ రులో ఆదివాసీ మహిళపై అఘాయి త్యానికి పాల్పడిన షేక్‌ మగ్దుంను వెంటనే శిక్షించాలని డిమాండ్‌చేస్తూ శనివారం ఆదివాసీ, తుడుందెబ్బ ఆధ్వర్యంలో తలపె ట్టిన రాష్ట్రబంద్‌ మండలాల్లో విజయ వంతం అయింది. ఈ సందర్భంగా ఆదివాసీ, తుడుందెబ్బ నాయకులు ఉదయం నుంచి దుకాణాలు, హోటళ్లు, కిరాణ, జనరల్‌స్టోర్‌లను మూసివేయిం చారు. బెజ్జూరులో ఎస్సై విక్రంకు వినతిపత్రం అందజేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Sep 21 , 2024 | 10:23 PM