ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Kumaram Bheem Asifabad: వాడీవేడిగా జడ్పీ సమావేశం

ABN, Publish Date - Jan 29 , 2024 | 10:21 PM

ఆసిఫాబాద్‌, జనవరి 29: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జడ్పీచైర్మన్‌ కోనేరు కృష్ణారావు అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌, జడ్పీ సీఈవో రత్నమాల, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు హజరయ్యారు.

- ప్రొటోకాల్‌పై రగడ

- అధికారుల తీరుపై సభ్యుల మండిపాటు

- అటవీ అనుమతుల ఆలస్యంతో అభివృద్ధికి ఆటంకం

ఆసిఫాబాద్‌, జనవరి 29: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో సోమవారం జడ్పీచైర్మన్‌ కోనేరు కృష్ణారావు అధ్యక్షతన జడ్పీ సర్వసభ్య సమావేశం వాడీవేడీగా జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్‌ హేమంత్‌ బోర్కడే, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, డీఎఫ్‌వో నీరజ్‌కుమార్‌ టిబ్రెవాల్‌, జడ్పీ సీఈవో రత్నమాల, ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, పాల్వాయి హరీష్‌బాబు హజరయ్యారు. అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరిస్తున్నా రని ప్రారంభోత్సవాలకు శంకుస్థాపనలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించకుండా ఇష్టారితీన వ్యవహరిస్తున్నారని సమావేశంలో సభ్యులు మండిపడ్డారు. సర్వసభ్య సమావేశానికి, అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలకు ఆయాశాఖల అధికారులు ప్రొటోకాల్‌ను పాటించడంలేదన్నారు. ప్రజాప్రతినిధులకు సమాచారం ఇవ్వకుండానే ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తున్నారని సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని కలెక్టర్‌ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో కలెక్టర్‌ ప్రొటోకాల్‌ విషయంలో ఇకనుంచి ప్రజాప్రతినిధులకు తెలియజేయాలని ఒక సర్క్యూలర్‌ను జారీచేస్తామని ఇది పాటించని అధికారులపై చర్యలు తీసుకుంటామ న్నారు. గడిచిన నాలుగున్నర సంవత్సరాలుగా అటవీ అనుమతులు రావటంలో అలస్యం అవుతున్నదని అధికారులు దీనిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అనుమతుల ఆలస్యంతో జిల్లాలో అభివృద్ధి కుంటు పడుతోందని సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఏజెన్సీ మండలాల్లో వంతెనలు, రోడ్లు నిర్మించుకోలేక పోతున్నామన్నారు. నిర్మాణ పనుల కోసం నిధులు మంజూరైనా కేవలం అటవీ అనుమతుల సాకుతో వందల పనులు నేటికీ పెండింగ్‌లోనే ఉన్నాయని ప్రజలకు సమాధానం చెప్పలేక పోతున్నామని సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. మిషన్‌భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్లా నీరు అందడంలేదన్నారు. కొన్నిచోట్ల నల్లాలు లేని కారణంగా నీరు వృథాగా పోతోందన్నారు. ఆసిఫాబాద్‌ పట్టణంతోపాటు మిగతాగ్రామాల్లో నల్లానీరు సరఫరా కావడంలేదని రాబోయే వేసవికాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఇంటింటికి తాగునీరు అందేలా అధికారులు దృష్టి సారించాలని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. జిల్లాలో కుమరంభీం, వట్టివాగు, జగన్నాథపూర్‌ ప్రాజెక్టుల పెండింగ్‌ పనులను వెంటనే పూర్తిచేసి కాలువలను ఆధునీకరించాలన్నారు. రైతాంగానికి చివరి పంటల వరకు సాగునీరు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సభ్యులు సూచించారు. గత ప్రభుత్వంలో మంజూరైన పనులు కొనసాగించాలని అందుకు ప్రభుత్వం నుంచి ఏమైనా స్పష్టమైన ఆదేశాలు వచ్చాయా అని సభ్యులు ప్రశ్నించడంతో డిసెంబరు3 తర్వాత ప్రారంభించని పనులను చేపట్టకూడదని ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు వచ్చాయని అధికారులు సభ్యుల దృష్టికి తీసుకురాగా గతంలో ప్రతిపాదించిన పనులను కొనసాగిం చాలని సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

సమస్యలపై సభ్యుల నిలదీత..

వాంకిడి కళాశాల ఆవరణలో మిషన్‌భగీరథ పైపులైన్‌ను ఫోర్‌లైన్‌ నిర్మాణ కంపెనీ ధ్వంసం చేయడంతో కళాశాలకు వెళ్లే 300మంది విద్యార్థులకు తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయని దాన్ని పరిష్కరించాలని వాంకిడి ఎంపీపీ విమలబాయి అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. మిషన్‌ భగీరథ పథకం పూర్తిగా విఫలమైందని ఇంటింటికి నల్లానీరు రావడంలేదని ఆసిఫాబాద్‌ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు అన్నారు. అడవిపందులు పంటలపై దాడిచేసి ధ్వంసం చేస్తున్నాయని రైతులకు నష్టపరిహరం అందజేయాలని అసిఫాబాద్‌ ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌ అన్నారు. పోడుపట్టాల భూముల్లో బోర్లు వేసుకొవడానికి అటవీశాఖ అధికారులు అనుమతులు ఇవ్వడంలేద న్నారు. అనుమతులు ఇప్పించాలని రెబ్బెన జడ్పీటీసీ సంతోష్‌కుమార్‌ అన్నారు. రైతులకు రాయితీపై ఆయిల్‌ఇంజన్లను మంజూరు చేయాలని వాంకిడి జడ్పీటీసీ అజయ్‌కుమార్‌ అన్నారు. ఆసిఫాబాద్‌ మండలంలో సెగ్రిగేషన్‌ షెడ్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని 22మంది సర్పంచులు సుమారు రూ.70నుంచి 80లక్షల బిల్లులు పెండింగ్‌లో ఉండటంతో తీవ్ర ఇబ్బందుల పడుతున్నారన్నారు. వెంటనే బిల్లులు చెల్లించాలని ఎంపీపీ అరిగెల మల్లిఖార్జున్‌ అన్నారు. అందవెల్లి వంతెన నిర్మాణ పనులను వెంటనే చేపట్టాలన్నారు. వర్షాకాలంలోగా పనులు పూర్తి చేసి రాకపోకలు పునరుద్దరించాలన్నారు. వర్షకాలం ప్రారంభమైతే పనులకు ఆటంకం కలుగుతుందని దహెగాం జడ్పీటీసీ శ్రీరామరావు అన్నారు.

సమన్వయంతో పనిచేయాలి..

కోనేరు కృష్ణారావు, జడ్పీచైర్మన్‌

అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి జిల్లా అభివృద్ధికి పాటుపడాలన్నారు. పెండింగ్‌ పనులను త్వరితగతిన పూర్తిచేయాలన్నారు. అధికారులు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాల కార్యక్రమాలకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని ప్రొటోకాల్‌ను పాటించాలన్నారు.

ప్రొటోకాల్‌ పాటించని అధికారులపై చర్యలు..

హేమంత్‌ బోర్కడే, జిల్లా కలెక్టర్‌

అన్నిశాఖల అధికారులు ప్రొటోకాల్‌ను పాటించాలి. ప్రభుత్వపరంగా చేపట్టే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలకు ప్రజాప్రతినిధులను ఆహ్వినించాలి. ఈ విషయమై సర్క్యులర్‌ను జారీ చేస్తాం. పాటించని అధికారులపై తప్పకుండా చర్యలు తీసుకుంటాం.

అందవెల్లి వంతెన నిర్మాణానికి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి..

- ఎమ్మెల్యే డాక్టర్‌ పాల్వాయి హరీష్‌బాబు

అందవెల్లి వంతన నిర్మాణ పనులను త్వరితగతిన చేపట్టాలి. ఈ పనులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. నాలుగు నెలలు గడిస్తే వర్షాలు వస్తాయి. వర్షాలు ప్రారంభమైతే రాకపోకలకు ఆటంకం ఏర్పడి దహెగాం మండల ప్రజలు బాహ్యప్రపంచానికి దూరం కావాల్సి వస్తుంది. అవసరమైతే నిధుల కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటాం.

ఆసిఫాబాద్‌-ఊట్నూర్‌ రోడ్డుకు మరమత్తులు చేపట్టాలి..

ఎమ్మెల్యే కోవ లక్ష్మి

ఆసిఫాబాద్‌ నుంచి కెరమెరి, జైనూరు నుంచి హస్నపూర్‌ వరకు ఆసిఫాబాద్‌-ఊట్నూర్‌ రోడ్డు అధ్వాన్నంగా మారింది. వెంటనే మరమత్తు పనులు చేపపట్టాలి. గుండివంతెన పనులను వర్షకాలం లోగా పూర్తి చేయాలి. మేకల కాపరులపై అటవి అధికారులు దాడులకు పాల్పడుతున్నారని ఈ చర్యలను మానుకోవాలన్నారు. మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు రావడంలేదన్నారు. మా ఇంటికే చుక్కనీరు రావడంలేదు ఇక ప్రజల పరిస్థితి ఏంటన్నారు. అధికారులు ప్రొటోకాల్‌ను విస్మరిస్తున్నారు. పద్ధతి మార్చుకొవాలన్నారు.

ప్రొటోకాల్‌ విషయంలో అధికారులు పరిశీలించాలి

- దండే విఠల్‌, ఎమ్మెల్సీ

అధికారం, పదవులులేని నాయకులను అధికారులు ఆహ్వానిస్తున్నారు. ప్రొటోకాల్‌ విషయంలో అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి. ఎన్నికలలో ఓడిపోయిన అభ్యర్థుల నుంచి అధికారులు పనులకు సంబంధించిన ప్రతిపాదనలు తీసుకుంటున్నారు. కేవలం ఎమ్మెల్యేల నుంచి వచ్చిన ప్రతిపాదనలనే అధికారులు తీసుకోవాలి. అటవీఅధికారులు మానవీయ కోణంలో అలోచించి అభివృద్ధికి సహకరించాలి.

Updated Date - Jan 29 , 2024 | 10:24 PM

Advertising
Advertising