ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: విద్యార్థులు భావిశాస్త్రవేత్తలుగా ఎదగాలి: కలెక్టర్‌

ABN, Publish Date - Nov 28 , 2024 | 10:34 PM

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు భావిశాస్త్ర వేత్తలుగా ఎదగాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.

- అట్టహాసంగా జిల్లా వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించిన కలెక్టర్‌

ఆసిఫాబాద్‌ రూరల్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు భావిశాస్త్ర వేత్తలుగా ఎదగాలని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. గురువారం జిల్లాకేంద్రం లోని సెయింట్‌మేరీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి ఇన్‌స్పైర్‌మనాక్‌, 52వ బాలల వైజ్ఞానికి ప్రదర్శన పండుగ అట్టహాసంగా ప్రారంభమైంది. కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, డీఈవో యాదయ్యతో కలిసి ఆయన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు. సైన్స్‌, గణితం ఇష్టపడి చదివిన వారు తమ సృజనతో నిత్య జీవితంలో ఎదురయ్యే సమస్యలకు త్వరగా పరిష్కారం చూపగలుగుతారన్నారు. నేనుకూడా సైన్స్‌, గణితంలో వందకు వందమార్కులు తెచ్చుకున్న విద్యార్థి నేనని తెలిపారు. యూపీఎస్సీ ఇంటర్వ్యూలో సైన్స్‌, గణితం విద్యార్థిగా సమస్యలకు సత్వర పరిష్కారం చూపుతానని సమాధానమిచ్చి ఐఏఎస్‌గా ఎంపికయ్యా నని అన్నారు. సమస్యకు పరిష్కారం చూపడం, ఆలోచన చేయడానికి సైన్స్‌, గణితం ఎంతగానే దోహద పడుతుందని అన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన వైజ్ఞానిక సదస్సులో భాగస్వాములైన విద్యార్థులు భావిశాస్త్రవేత్త లుగా ఎదిగేలా ప్రతిభ చాటాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర, జాతీయస్థాయిలో మన జిల్లాఖ్యాతిని పెంచాలని సూచిం చారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ నేటి విద్యార్థులే రేపటి బాధ్యతాయుత పౌరులన్నారు. అనంతరం వారు విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులను పరిశీలించారు. అనంతరం విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో డిపార్టుమెంట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఢిల్లీ సీనియర్‌ అసోసియేట్‌ శుభదీప్‌ బెనర్జీ, డిగ్రీకళాశాల ప్రిన్సిపాల్‌ శ్రీదేవి, ప్రిన్సిపాల్‌ త్రిష్య్మ, ఎంఈవో ప్రభాకర్‌, డీఈవో కార్యాలయ ఎఫ్‌ఏవో దేవాజీ, ఏసీజీ ఉదయబాబు, ఎంఈవో సుభాష్‌, ఏసీఎంవో ఉద్దవ్‌, సైన్స్‌ అధికారి మధుకర్‌, వెంకటేశ్వర్లు, యూఎన్‌ చారి, ఊశన్న తదితరులు పాల్గొన్నారు.

బాలల చలన చిత్రాల ప్రత్యేక ప్రదర్శన..

ఆసిఫాబాద్‌: జిల్లాలోని సినిమా థియేటర్లలో బాలల చలనచిత్రాల ప్రత్యేకప్రదర్శన నిర్వహిస్తామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే ఒక ప్రకటనలో తెలిపారు. హోంశాఖ, సీనిగ్లో, చిల్డ్రన్స్‌ ఫిల్మ్‌సొసైటీ జిల్లాలోని సినిమా థియే టర్లలో బాలల చిత్రాలను ఉదయం 9నుంచి 11గంటల వరకు ప్రత్యేకంగా ప్రదర్శించేందుకు ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఆగస్టు1,2024నుంచి సెప్టెంబరు 30, 2025వరకు రాష్ట్రంలోని అన్ని సినిమాథియేటర్లలో ఉదయం 9నుంచి 11గంటలవరకు అనుమతించిన సమయాల్లో పాఠశాలలకు వెళ్లే బాలలకు ప్రదర్శిస్తారని తెలిపారు. ఒక్కో టికెట్‌ధర పట్టణప్రాంతాల విద్యార్థులకు రూ.30, గ్రామీణప్రాంతాల విద్యార్థులకు రూ.25గా నిర్ణయించామన్నారు. తహసీల్దార్‌లు, ఎంపీడీవోలు, ఎంఈవోలు టికెట్ల పంపిణీకి అవసరమైనప్పుడు నిర్వాహకులకు సహకరించాలని తెలిపారు.

Updated Date - Nov 28 , 2024 | 10:34 PM