Kumaram Bheem Asifabad: మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతి
ABN, Publish Date - Nov 28 , 2024 | 10:32 PM
బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరా డిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు, మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతిని జిల్లా కేంద్రం లో, కాగజ్‌నగర్‌లో, మండలాల్లో మాలి సంక్షేమ సంఘంఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వ హించారు.
ఆసిఫాబాద్‌రూరల్/కాగజ్‌నగర్/వాంకిడి/ కెరమెరి/చింతలమానేపల్లి/సిర్పూర్(టి)/ రెబ్బెన/కౌటాల, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): బడుగు, బలహీనవర్గాల హక్కుల కోసం పోరా డిన మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు, మహాత్మా జ్యోతిబాఫూలే వర్ధంతిని జిల్లా కేంద్రం లో, కాగజ్‌నగర్‌లో, మండలాల్లో మాలి సంక్షేమ సంఘంఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వ హించారు. ఈసందర్భంగా ఆయన విగ్రహానికి, చిత్రపటాలకు పూలమాలలువేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఆసంఘం నాయ కులు శంకర్,మారుతి, ఎమ్మార్పీఎస్ నాయకులు కేశవరావు, సోమయ్య, మారుతి, బాబురావు, మాజీఎంపీపీ అరిగెల మల్లికార్జున్, విజయ్, సొల్లులక్ష్మి, మంగ,విశ్రాంత ఉద్యోగులసంఘం అధ్యక్షుడుజయదేవ్, ప్రసాద్,నర్సింగరావు, నారాయణ, రాజేంద్రప్రసాద్, కిషన్, సర్దార్, సలీం, బీసీఐక్యసంఘర్షణసమితి జిల్లా అధ్య క్షుడు కేసరి అంజనేయులు గౌడ్ పాల్గొన్నారు.
Updated Date - Nov 28 , 2024 | 10:32 PM