ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఎస్పీంఎలో లోడింగ్‌ పాయింట్లను పెంచాలి

ABN, Publish Date - Oct 27 , 2024 | 10:35 PM

కాగజ్‌నగర్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఎస్పీఎంలో లోడింగ్‌ పాయింట్లను పెంచాలని లారీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌ డిమాండ్‌ చేశారు.

ఎస్పీఎం యాజమాన్యం వెంటనే సమస్యను పరిష్కరించాలి

- లారీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌

కాగజ్‌నగర్‌, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): ఎస్పీఎంలో లోడింగ్‌ పాయింట్లను పెంచాలని లారీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మంచిరెడ్డి రాజేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ సమస్యను జేకే యాజమాన్యం వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. కాగజ్‌నగర్‌లో కొన్నిరోజులుగా లారీ అసోసియేషన్‌సభ్యులు చేస్తున్న సమ్మెకు మద్దతు పలికి అనంతరం ఆయన మాట్లాడారు. లారీ అసోసియేషన్‌ సభ్యుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేందుకు ఎస్పీఎం యాజమాన్యం సహకరించాలన్నారు.

అదేవిధంగా పెరిగిన డీజిల్‌ ధరలకు అనుగుణంగా కిరాయి ధరలను పెంచాలన్నారు. త్వరలోనే మిల్లు గేటు ఎదుట ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా లారీ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతామన్నారు. రాష్ట్ర వ్యాప్త బంద్‌ చేపట్టేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిపారు. సమావేశంలో రాష్ట్రకార్యదర్శి చాంద్‌పాషా, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అక్బర్‌, కార్యదర్శి రమేష్‌, మంచిర్యాల మాజీకార్యదర్శి రఫీక్‌, కాగజ్‌నగర్‌ లారీ అసోసియేషన్‌ అధ్యక్షుడు కిషోర్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 27 , 2024 | 10:35 PM