ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: ఇందిరమ్మ ఇళ్లపై ఆశలు

ABN, Publish Date - Dec 10 , 2024 | 11:08 PM

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు రంగం సిద్ధమైంది. పారదర్శకంగా ఎంపిక చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.

- అర్హుల ఎంపికకు ప్రత్యేకయాప్‌

- జిల్లాలో 1,54,136 దరఖాస్తులు

ఆసిఫాబాద్‌రూరల్‌, డిసెంబరు 10(ఆంధ్రజ్యోతి): ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు రంగం సిద్ధమైంది. పారదర్శకంగా ఎంపిక చేపట్టేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఎన్నికల మేనిఫెస్టో అమలులో భాగంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. లబ్ధిదారుల ఎంపికకోసం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈనెల5న ప్రత్యేకయాప్‌ను ఆవిష్క రించారు. దీంతో దరఖాస్తుదారుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను దశలవారీగా అమలు చేస్తోంది. ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే రైతులకు రుణమాఫీ, మహిళలకు ఉచితబస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం, రూ. 500కే వంటగ్యాస్‌ సిలిండర్‌ పథకాలను ప్రారంభించింది. తాజాగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. దీంతో ఎన్నోఏళ్లుగా సొంతింటి కోసం ఎదురుచూస్తున్న పేదలకల సాకారం కానుంది. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో ముందుగా ఇంటిస్థలం ఉన్న వారికి ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయనుంది. ఒక్కో లబ్ధిదారు ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.5లక్షలు ఇవ్వనుంది. నిర్మాణదశలను అనుసరించి నాలుగు విడతల్లో లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనుంది.

జిల్లాకు 7వేల ఇళ్లు కేటాయింపు..

ప్రజాపాలనలో జిల్లావ్యాప్తంగా 15మండలాల్లోని 335పంచాయతీల పరిధిలో వివిధ పథకాల కోసం 1,63,647 దరఖాస్తులు వచ్చాయి. వీటిలో ఇందిరమ్మ ఇళ్ల కోసం 1,54,136దరఖాస్తులు వచ్చాయి. ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో సొంతస్థలం ఉన్న నిరుపేదలకు తొలిప్రాధాన్యత ఇవ్వనున్నారు. ముఖ్యంగా ఆదివాసీ గిరిజనులు, దళితులు, పారిశుధ్య కార్మికులు, వ్యవసాయ కూలీలు, దివ్యాంగులు, ట్రాన్స్‌జెండర్లకు ముందుగా ఇళ్లు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. జిల్లాలోని ఆసిఫాబాద్‌, సిర్పూర్‌ నియోజకవర్గాలకు 3500చొప్పున జిల్లాలకు 7వేల ఇళ్లు మంజూరు కానున్నాయి.

ప్రతి మండల కేంద్రంలో నమూనా ఇళ్లు..

లబ్ధిదారులు తమకున్న స్థలాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకుని ఇళ్లు నిర్మించుకునేలా ప్రతి మండలకేంద్రంలో ఒకనమూనా ఇంటిని నిర్మించనున్నారు. ఈ మేరకు గృహనిర్మాణశాఖకు సంబంధించి జిల్లాకు ఒక డీఈ, ఏఈ, సీఎల్‌టీసీని నియమించింది. వారు నమూనా ఇంటి నిర్మాణ కోసం జిల్లాలోని అన్ని మండలాల్లో స్థలాలు పరిశీలించి సిద్ధం చేస్తున్నారు.

యాప్‌ ద్వారానే గుర్తింపు..

ప్రభుత్వం యాప్‌ ద్వారా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను గుర్తించనుంది. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఇందిరమ్మ యాప్‌ను గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకొని వివరాలు నమోదు చేయాలి. దరఖాస్తుదారు పేరు, ఆధార్‌ నెంబర్‌, సంవత్సర ఆదాయం, సొంత స్థలం, ఇప్పటివరకు ఇందిరమ్మ పథకం కింద లబ్దిపొందారా తదితర 35రకాల ప్రశ్నలకు సమాధానాలు యాప్‌లో నమోదు చేయాలి. దరఖాస్తుదారులకు ఫోన్‌లేని పక్షంలో అధికారులు ఇంటికి వచ్చినపుడు వివరాలు తెలియజేయాలి. యాప్‌లో ఏఐ టెక్నాలజీని ఉపయోగించి దరఖాస్తుదారు ముఖం, ఇళ్లు నిర్మించే భౌగోళిక అక్షాంశాలు, రేఖాంశాల వివరాలు నమోదు చేస్తారు. ఇళ్ల నిర్మాణ ప్రగతిని కూడా ఎప్పటికప్పుడు ఏఐ ఆధారంగా ఫొటోలు తీస్తారు. ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా మున్సిపాలిటీల్లో ముఖ్య ప్రణాళిక అధికారుల ఆధ్వర్యంలో, గ్రామపంచాయతీల్లో ఎంపీడీవోల ఆధ్వర్యంలో యాప్‌లో వివరాలు నమోదు చేస్తారు.

Updated Date - Dec 10 , 2024 | 11:08 PM