ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kumaram Bheem Asifabad: కంకాలమ్మ జాతరకు పోటెత్తిన భక్తజనం

ABN, Publish Date - Dec 01 , 2024 | 11:19 PM

కౌటాల, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై ఆదివారం నిర్వహించిన జాతరకు భక్తజనం పొటెత్తారు. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం గుట్టవైపే చేరుకోవడం కనిపిం చింది.

- ఇతర రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్తులు

- అలంరించిన నృత్యాలు, శివసత్తుల పూనకాలు

- దర్శించుకున్న కలెక్టర్‌

- జనసంద్రమైన కౌటాల

కౌటాల, డిసెంబరు 1(ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలోని కంకాలమ్మ గుట్టపై ఆదివారం నిర్వహించిన జాతరకు భక్తజనం పొటెత్తారు. ఎటుచూసినా భక్తులు అమ్మవారి దర్శనం కోసం గుట్టవైపే చేరుకోవడం కనిపిం చింది. ఎంతో పురాతమైన చరిత్ర కలిగిన ఈ ఆలయంలో 20సంవత్సరాలుగా మహాజాతర నిర్వహిస్తున్నారు. అమ్మ వారికి దీపారాధనతో మొదలైన జాతర ప్రముఖులు, స్వామీలతో పొటెత్తింది. ఆలయకమిటీ చైర్మన్‌ సుల్వ కనయ్య, కళ్యాణి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌక ర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లుచేశారు. సాయంత్రం వరకు 30వేల మంది దర్శించుకోగా పెద్ద సంఖ్యలో క్యూలో భక్తులు బారులు తీరిఉన్నారు.

వేలసంఖలో తరలివచ్చిన భక్తులు..

తెలంగాణ నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో జాతరకు తరలివచ్చారు. భక్తులు గుట్టలపై అమ్మవారికి నైవేద్యం వండి సమర్పించారు. ముఖ్యంగా 12సంవత్సరాల క్రితం అమ్మవారిని దర్శించు కున్న చక్రధర్‌ అనే వ్యక్తి కుటుంబంతో సహా అమెరికాలో స్థిరపడ్డారు. ఈసారి అమ్మవారి దర్శణానికి కుటుంబ సమేతంగా ఆమెరికా నుంచి వచ్చి నాలుగు రోజులుగా పూజల్లో పాల్గొనడం విశేషం.

అలరించిన శివసత్తుల పూనకాలు..

జాతర శివసత్తులు పూనకాలు, పట్నాలతో చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నారు. గుట్టపైకి వచ్చే ప్రముఖులను పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.

దర్శించుకున్న కలెక్టర్‌ దంపతులు..

జాతర సందర్భంగా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే సతీ సమేతంగా కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్నారు. నిర్వాహకులు కలెక్టర్‌ దంపతులకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అలాగే కాగజ్‌నగర్‌ డీఎస్పీ రామానుజం అమ్మవారికి ప్రత్యేకపూజలు నిర్వహించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రముఖులు అమ్మవారిని దర్శించుకన్నారు.

భక్తులకు అన్నదానం..

వేల సంఖ్యలో వచ్చిన భక్తుల కొరకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మహాఅన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లుచేశారు. సేద తీరేందుకు షామియానాలు ఏర్పాటు చేశారు. జాతరలో చిన్నపిల్లల కోసం రంగులరాట్నం తదితర వాటిని ఏర్పాటు చేశారు. చిన్నపిల్లల ఆట వస్తువులు, వెదురుతో తయారు చేసిన వస్తువుల దుకాణాలు ఏర్పాటు చేశారు.

గట్టిబందో బస్తు..

జాతరకు పోలీసుశాఖ భారీ బందోబస్తు ఏర్పాటు చేసింది. కాగజ్‌నగర్‌ డీఎస్పీ రామానుజన్‌, సీఐ రమేష్‌తో పాటు ఎస్సైలు మధుకర్‌, కమలాకర్‌, రమేష్‌, రాజు, ప్రవీణ్‌తోపాటు 200 మంది పోలీసులు భారీ బందో బస్తు లో పాల్గొన్నారు. ట్రాఫిక్‌కు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా పార్కింగ్‌, బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Updated Date - Dec 01 , 2024 | 11:19 PM