ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Kumaram Bheem Asifabad: ఆదిలాబాద్‌ బీఆర్‌ఎస్‌ ఎంపీ ఆభ్యర్థిగా అత్రం సక్కు

ABN, Publish Date - Mar 14 , 2024 | 11:30 PM

ఆసిఫాబాద్‌, మార్చి 14: ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ను ఆత్రం సక్కుకు కేటాయి స్తున్నట్లు ప్రకటించారు.

- ఖరారు చేసిన బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌

ఆసిఫాబాద్‌, మార్చి 14: ఆదిలాబాద్‌ లోక్‌సభ స్థానానికి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆసిఫాబాద్‌ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేరును అధిష్ఠానం ఖరారు చేసింది. ఈ మేరకు గురువారం పార్టీ అధినేత కేసీఆర్‌ ఆదిలాబాద్‌ ఎంపీ టికెట్‌ను ఆత్రం సక్కుకు కేటాయి స్తున్నట్లు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి 11స్థానాల్లో అభ్యర్థుల పేర్లను ఖరారు చేయగా ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి ఆత్రం సక్కుకు అవకాశం దక్కింది. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి ఎంపీ టికెట్‌ కోసం మాజీ ఎంపీ గెడం నగేష్‌, మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు పేర్లను పరిశీలనలో ఉంచగా ఇటీవల మాజీ ఎంపీ గెడం నగేష్‌ బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అధిష్ఠానం బీజేపీ అభ్యర్థిగా నగేష్‌ పేరును ప్రకటించింది. దీంతో ఆత్రం సక్కుకు లైన్‌ క్లియర్‌ అయింది. ఈ మేరకు ఆదిలాబాద్‌ ఎంపీ స్థానానికి అత్రం సక్కు పేరును బీఆర్‌ఎస్‌ ప్రకటించింది.

వ్యక్తిగత సమాచారం :

పేరు : ఆత్రం సక్కు

భార్య పేరు : తులసి, ఉపాధ్యాయురాలు

తల్లిదండ్రులు : మాన్కుబాయి- రాజు

స్వగ్రామం : లక్ష్మిపూర్‌, తిర్యాణి మండలం

ప్రస్తుత నివాసం : ఆసిఫాబాద్‌

పుట్టిన తేదీ : 02-03-1973

కులము : గోండు

విద్యార్హతలు : ఇంటర్‌

పిల్లలు : ఆరుగురు(వినోద్‌,అంకిత్‌, అన్వేష్‌, దివ్యలక్ష్మి, హిమబిందు, జంగుబాయి)

రాజకీయ చరిత్ర : 1993లో ఉపాధ్యాయ వృత్తిలో చేరి తుడుందెబ్బ జిల్లా ప్రచారకార్యదర్శిగా, ఏపీటీఎఫ్‌ కార్యదర్శిగా డబ్ల్యూటీయూ జిల్లాఉపాధ్యక్షుడిగా, రాయిసెంటర్‌ సంయుక్త కార్యదర్శిగా పదువులు చేపట్టారు. గిరిజన ఉపాధ్యాయ సంఘాల్లో పనిచేసి 2008లో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. 2009లో ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌పార్టీ నుంచి పోటీచేసి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి పెందూర్‌ గోపిపై గెలుపొందారు. 2014ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీచేసి బీఆర్‌ఎస్‌ చేతిలో ఓటమి పాలయ్యారు. 2018ఎన్నికలలో కాంగ్రెస్‌పార్టీ నుంచి బరిలో నిలిచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోవలక్ష్మిపై గెలుపొందారు. అనంతరం కాంగ్రెస్‌ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. 2023ఎన్నికలలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే అయిన ఆత్రం సక్కుకు బదులుగా జడ్పీ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న కోవ లక్ష్మికి టికెట్‌ కేటాయించారు. అప్పుడే ఆదిలాబాద్‌ ఎంపీ స్థానం కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఆహామీమేరకు 2024లోక్‌సభ ఎన్నికలలో ఆదిలాబాద్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా ఆత్రం సక్కు పేరును ప్రకటించింది.

Updated Date - Mar 14 , 2024 | 11:30 PM

Advertising
Advertising