Kumaram Bheem Asifabad: ప్రభుత్వ భూముల్లో వెంచర్లపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Jan 29 , 2024 | 10:19 PM
ఆసిఫాబాద్, జనవరి 29: వాంకిడి మండలం తేజాపూర్ గ్రామపరిధిలోని ప్రభు త్వ భూముల్లో ఇష్టా రాజ్యంగా వెంచర్లు వేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు సోమవారం కలెక్టర్ హేమంత్ బోర్కుడేకు వినతిపత్రం అందజేశారు.
ఆసిఫాబాద్, జనవరి 29: వాంకిడి మండలం తేజాపూర్ గ్రామపరిధిలోని ప్రభు త్వ భూముల్లో ఇష్టా రాజ్యంగా వెంచర్లు వేస్తున్నారని వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ నాయకులు సోమవారం కలెక్టర్ హేమంత్ బోర్కుడేకు వినతిపత్రం అందజేశారు. తేజాపూర్‌శివారులో నోటిఫైడ్ విలేజ్‌ఉండగా ఇష్టారాజ్యంగా వెంచర్లు వేయడానికి బడాబాబులు కొంతమంది ప్రజా ప్రతినిధులతో కుమ్మక్కై అమాయక ప్రజలను మోసం చేస్తున్నారన్నారు. అతితక్కువ ధరకేప్లాట్లు అమ్ముతామని నమ్మబలికి వెంచ ర్లు వేయడానికి సిద్దమవుతున్నారని విచారణ జరిపి వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో కూశనరాజన్న, దినకర్, రాజ్‌కుమార్, ఆనంద్‌కుమార్, కార్తీక్, బాబురావు, సత్తయ్య, పోచయ్య, హనుమంతు, తిరుపతి, రమేష్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Jan 29 , 2024 | 10:19 PM