రోడ్డు భద్రత నియయాలు పాటించాలి
ABN, Publish Date - Jan 18 , 2024 | 10:15 PM
ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్ అన్నారు. గురువారం వేంపల్లిలో గల ఆర్టీఏ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల బ్యానర్లు, గోడ ప్రతులు, స్టిక్క ర్లను ఆవిష్కరించారు.
హాజీపూర్, జనవరి 18: ప్రతీ ఒక్కరు రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలని డీసీపీ సుధీర్‌రాంనాధ్‌కేకన్ అన్నారు. గురువారం వేంపల్లిలో గల ఆర్టీఏ కార్యాలయంలో జిల్లా రవాణా శాఖ అధికారి కిష్టయ్యతో కలిసి 37వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల బ్యానర్లు, గోడ ప్రతులు, స్టిక్క ర్లను ఆవిష్కరించారు. డీసీపీ మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించడం ద్వారా సురక్షితంగా ప్రయాణించి గమ్య స్ధానాలకు చేరుకోవచ్చ న్నారు. ఈ నెల 15 నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు జిల్లాలో రోడ్డు భద్రత మాసోత్సవాలు నిర్వహిస్తామని, ప్రజలకు రోడ్డు భద్రత నిబంధనలపై అవ గాహన కల్పిస్తామన్నారు. ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, కారు నడిపే వారు సీటు బెల్టు ధరించాలని, ఫోన్ మాట్లాడుతు, మద్యం సేవించి వాహ నాలు నడపవద్దని సూచించారు. ఆటోలు, జీపులు, ఇతర ప్రైవేటు వాహనా ల్లో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవద్దని సూచించారు. రహదారులలో విధించిన వేగ పరిమితిని మించి ప్రయాణించ వద్దన్నారు. రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ గమ్యస్ధానాలకు చేరాలన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 10:15 PM