ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

తప్పుడు ఆరోపణలు మానుకోవాలి

ABN, Publish Date - Apr 03 , 2024 | 10:16 PM

ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు తనపై చేస్తున్న తప్పుడు ఆరో పణలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివా కర్‌రావు అన్నారు. బుధ వారం జిల్లా కేంద్రం లోని ఆయన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రేం సాగర్‌రావు తాను భూమి అమ్మితే రూ.30 కోట్లు వచ్చాయని, శామీర్‌పేటలో విల్లా కొన్నా నని నిరాధార ఆరోపణలు చేశాడన్నారు.

ఏసీసీ, ఏప్రిల్‌ 3: ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేం సాగర్‌రావు తనపై చేస్తున్న తప్పుడు ఆరో పణలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే దివా కర్‌రావు అన్నారు. బుధ వారం జిల్లా కేంద్రం లోని ఆయన నివాసం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రేం సాగర్‌రావు తాను భూమి అమ్మితే రూ.30 కోట్లు వచ్చాయని, శామీర్‌పేటలో విల్లా కొన్నా నని నిరాధార ఆరోపణలు చేశాడన్నారు. తాను ఎక్కడ భూమి అమ్మానో, ఎక్కడ విల్లా కొన్నానో చూపించాలన్నారు. అంతర్గాంలో అత్తగారి నుంచి తనకు భూమి సంక్రమించిన మాట వాస్తవమేనని, దానికి గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మా ణానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. గోదావరిపై తాను మంజూరు చేయించిన బ్రిడ్జి 12 మీటర్ల వెడల్పు ఉంటుందని, ఇరువైపులా అప్రోచ్‌ రోడ్ల కూడా ఉంటాయని, ప్రేంసాగర్‌రావు కావాలని సింగిల్‌ లైన్‌ బ్రిడ్జి అని దుష్ప్రచారం చేస్తున్నాడన్నారు. తన హయాంలో అనేక పనులకు నిధులు మంజూరయ్యాయని, వాటి ఫలితం ఇప్పుడు కనిపిస్తుందన్నారు. తాను, మున్సి పల్‌ మాజీ చైర్మన్‌ అంతర్గాంలో 30 ఎకరాలు కొన్నామని అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలన్నారు. రైల్వే అండర్‌ బ్రిడ్జి పనికి రాకుండా మారిందని కాంగ్రెస్‌ నాయకులు అంటున్నారని, గోదావరిపై బ్రిడ్జి నిర్మాణం, పట్టణంలో నిర్మించిన రైల్వే అండర్‌ బ్రిడ్జిపై ప్రజాభిప్రాయ సేకరణ చేసి మెజార్టీ ప్రజలు ఎలా కోరితే అలా ముందుకు వెళ్లాలన్నారు. మంచిర్యాల అభివృద్ధిని వ్యతిరేకిం చే వ్యక్తిగా ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడని, తనపై చేస్తున్న ఆరోపణలను నిరూపించాలని సవాల్‌ విసిరారు. అంకం నరేష్‌, తోట తిరుపతి పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 10:16 PM

Advertising
Advertising