ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు

ABN, Publish Date - Mar 28 , 2024 | 10:54 PM

పార్లమెంట్‌ ఎన్ని కల నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించమని, ని బంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ తెలిపారు. గురువా రం సీఈఆర్‌ క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ ఓటర్లను మద్యం, డబ్బుతో ప్రలోభాలు చేసినా ఉపేక్షించమన్నారు.

మందమర్రిటౌన్‌, మార్చి 28: పార్లమెంట్‌ ఎన్ని కల నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించమని, ని బంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్‌ తెలిపారు. గురువా రం సీఈఆర్‌ క్లబ్‌లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించారు. ఏసీపీ మాట్లాడుతూ ఓటర్లను మద్యం, డబ్బుతో ప్రలోభాలు చేసినా ఉపేక్షించమన్నారు. ప్రతీ ఒక్కరు ఎన్నికల నిబం ధనలు పాటించాలని సూచించారు. అక్రమంగా డబ్బు, మద్యం తరలిస్తే సీజ్‌ చేస్తామన్నారు. ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. సీఐ శశిధర్‌రెడ్డి, మున్సి పల్‌ కమిషనర్‌ వెంకటేశ్వర్లు, తహసీల్దార్‌ తది తరులు పాల్గొన్నారు.

భీమారం: అర్హులైన వారందరు ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని ఏసీపీ వెంక టేశ్వర్లు పేర్కొన్నారు. గురువారం సాయంత్రం మండల కేంద్రంలో సీఐ మోహన్‌, ఎస్‌ఐరాములు, జైపూర్‌,శ్రీరాంపూర్‌ ఎస్‌ఐలు శ్రీధర్‌, సంతోష్‌లతో కలిసి ఆవడం క్రాస్‌రోడ్డు నుంచి ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వ హించారు. ఏసీపీ మాట్లాడుతూ ఓటు సామా న్యుని వజ్రాయుధమని, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా వినియోగించుకోవాలని సూచిం చారు. ఎన్నికల సందర్భంగా మద్యం, నగదు సర ఫరా కాకుండా ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఏఎస్‌ఐ శకుంతల, భూమన్న, సీఆర్‌పీఎఫ్‌ బలగాలు పాల్గొన్నాయి.

జైపూర్‌: పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించారు. ఇందా రం బస్టాండ్‌ నుంచి గ్రా మం మీదుగా హైస్కూ ల్‌ వరకు కేంద్ర బల గాలతో ఫ్లాగ్‌మార్చ్‌ చేప ట్టారు. ఏసీపీ వెంకటేశ్వ ర్లు మాట్లాడుతూ ఎన్ని కల్లో ప్రశాంతంగా నిర్వహించడానికి ప్రజలు సహకరించాలన్నారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. శ్రీరాంపూర్‌ సీఐ మోహన్‌, జైపూర్‌ ఎస్‌ఐ శ్రీధర్‌, భీమారం ఎస్‌ఐ రాములు, శ్రీరాంపూర్‌ ఎస్‌ఐ సంతోష్‌, అదనపు ఎస్‌ఐ నాగరాజు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 10:54 PM

Advertising
Advertising