ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

ABN, Publish Date - Mar 28 , 2024 | 11:57 PM

ఒక మహిళను హత్య చేసిన వ్యక్తికి యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయస్థానం గురువారం జీవిత ఖైదు శిక్ష విధించింది.

హత్య కేసులో నిందితుడికి జీవితఖైదు

భువనగిరి టౌన, మార్చి 28: ఒక మహిళను హత్య చేసిన వ్యక్తికి యాదాద్రి భువనగిరి జిల్లా న్యాయస్థానం గురువారం జీవిత ఖైదు శిక్ష విధించింది. పట్టణ ఇనస్పెక్టర్‌ కె. సు రేష్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం... ధర్మగడండ తండా దేవరుప్పల మండలం వరంగల్‌ జిల్లాకు చెందిన వితంతువైన చౌడబోయిన లక్ష్మి ముగ్గురు పిల్లలతో కలిసి హైదరాబాద్‌ బంజారాహిల్స్‌ నందినగర్‌లో నివాసముండేది. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తుంది. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన కుమార్‌ వెంకన్నతో పరిచయమైం ది. ఇరువురి మధ్య పెరిగిన పరిచయం కొద్ది రోజులు సాఫీగా సాగినా కొన్ని వివాదాలకు దారి తీసింది. ఈ నేపథ్యంలో మాట్లాడుకుందామని లక్ష్మిని 2020 నవంబరు 11వ తేదీన వెంకన్న ఆమెను ఇంటి నుంచి బయటకు తీసుకెళ్లాడు. అయితే భువనగిరి జిల్లా ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం ఉన్నట్లు అందిన సమాచారం మేరకు మరుసటి రోజ ఆసుపత్రికి వచ్చి మృతదేహాన్ని పరిశీలించడంతో ఆ మృతదేహం ఆమె తల్లి లక్ష్మిదిగా గుర్తించారు. దీంతో కుమార్తెల ఫిర్యాదు మేరకు భువనగిరి పట్టణ అప్పటి సీఐ ఏ సుధాకర్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరంగల్‌ - హైదరాబాద్‌ రహదారి వెంట భువనగిరి సమీపంలో లక్ష్మిని నిందితుడు కుమార్‌ వెంకన్న కిరాతకంగా గొంతుకోసి తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు తేలింది. ఈ మేరకు పూర్తి సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించడంతో హత్యానేరం రుజువుకావడంతో మొదటి అదనపు జిల్లా, సెషన జడ్జి కె.మారుతీదేవి కుమార్‌కు జీవిత శిక్షను విధిస్తూ తీర్పునిచ్చారు. దీంతో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకొని చర్లపల్లి జైలుకు తరలించారు. నిందితుడికి శిక్ష పడేలా సాక్ష్యాధారాలు సేకరించిన పోలీసులను, పీపీని కోర్టు అభినందించింది.

Updated Date - Mar 28 , 2024 | 11:57 PM

Advertising
Advertising