కంగారూలు చిక్కినట్టేనా!
ABN, Publish Date - Nov 24 , 2024 | 01:26 AM
తడ‘బ్యాటు’తో మొదలైన టెస్ట్‌లో.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (62 బ్యాటింగ్) పటిష్టమైన డిఫెన్స్‌తో ఎదురునిలిచారు. దీంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో భారత్ అనూహ్యంగా...
భారత్ రెండో ఇన్నింగ్స్ 172/0
మొత్తం ఆధిక్యం 218 పరుగులు
జైస్వాల్, రాహుల్ అదుర్స్‌ఫ ఆసీ్‌స తొలి ఇన్నింగ్స్104
పెర్త్: తడ‘బ్యాటు’తో మొదలైన టెస్ట్‌లో.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (90 బ్యాటింగ్), కేఎల్ రాహుల్ (62 బ్యాటింగ్) పటిష్టమైన డిఫెన్స్‌తో ఎదురునిలిచారు. దీంతో ఆస్ట్రేలియాతో తొలి టెస్ట్‌లో భారత్ అనూహ్యంగా పట్టుబిగించింది. ఆటకు రెండో రోజు ఓవర్‌నైట్ స్కోరు 67/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ 104 పరుగులకు ఆలౌటైంది. మిచెల్ స్టార్క్ (26), క్యారీ (21) కాసేపు ప్రతిఘటించారు. బుమ్రా 5 వికెట్లు, హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 46 పరుగుల ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన భారత్ శనివారం ఆటముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. మొత్తంగా 218 పరుగుల ఆధిక్యం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 150 పరుగులు చేసిన సంగతి తెలిసిందే.
తెరదించిన హర్షిత్: స్టార్క్ పోరాటంతో ఆసీస్ స్కోరు సెంచరీ మార్క్ దాటింది. జోష్ మీదున్న బుమ్రా రెండో ఓవర్‌లోనే ఓవర్‌నైట్ బ్యాటర్ క్యారీని అవుట్ చేశాడు. కానీ, స్టార్క్, హాజెల్‌వుడ్ (7 నాటౌట్) బౌలర్లను విసిగిస్తూ పదో వికెట్‌కు 25 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లియోన్ (5), స్టార్క్‌ను అవుట్ చేసిన హర్షిత్.. కంగారూ ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
అసలుసిసలు టెస్ట్ బ్యాటింగ్‌తో..: ఎన్నో అనుమానాల మధ్య రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన జైస్వాల్, రాహుల్ తొలి వికెట్‌కు అజేయంగా 172 పరుగుల భాగస్వామ్యంతో ఆట తీరును పూర్తిగా మార్చేశారు. ఆసీస్ సహనాన్ని పరీక్షించారు. తొలి ఇన్నింగ్స్‌లో డకౌటైన జైస్వాల్ ఈసారి సమయస్ఫూర్తితోపాటు చక్కని షాట్లతో చెలరేగగా.. రాహుల్ కచ్చితమైన సాంకేతిక నైపుణ్యంతో ఎదురు నిలిచాడు. వీరిద్దరూ మంచి బంతులను గౌరవిస్తూనే.. గతితప్పిన బంతులను బౌండ్రీ దాటించారు. క్రమంగా బంతి పాతబడడంతోపాటు పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా మారడంతో వీరి పని మరింత సులువైంది. సమన్వయ లోపంతో రాహుల్ రనౌట్ ప్రమాదాన్ని తప్పించుకోవడం మినహా.. వీరిద్దరూ ఆసీస్ బౌలర్లకు ఏమాత్రం చాన్సులివ్వలేదు. షాట్లు ఆడే జైస్వాల్ కొంత సంయమనంతో వ్యవహరించాడు. అతడిని బోల్తా కొట్టించడానికి కమిన్స్ చేసిన బౌలింగ్ మార్పులు, ఎత్తులు ఏమాత్రం పారలేదు.
దీంతో టీ సమయానికి భారత్ 84/0తో నిలిచింది. బ్రేక్ తర్వాత కూడా టీమిండియా ఓపెనర్లు ఏమాత్రం దూకుడు కనబర్చకుండా నింపాదిగా ఆడారు. 38వ ఓవర్‌లో లియోన్ బౌలింగ్‌లో జైస్వాల్ సింగిల్‌తో హాఫ్ సెంచరీ చేయగా.. జట్టు స్కోరు కూడా సెంచరీ మార్క్ దాటింది. యశస్వి క్రమంగా వేగం పెంచారు. స్టార్క్ బౌలింగ్‌లో జైస్వాల్ సిక్స్ బాదగా.. ఫోర్ కొట్టిన రాహుల్ ఆ తర్వాత ఫిఫ్టీ పూర్తి చేసుకొన్నాడు. చివరి సెషన్‌లో కూడా వికెట్ చేజార్చుకోకుండా రోజును మెరుగ్గా ముగించారు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్.
ఆస్ర్టేలియా తొలి ఇన్నింగ్స్: ఖవాజా (సి) విరాట్ (బి) బుమ్రా 8; మెక్‌స్వీనే (ఎల్బీ) బుమ్రా 10; లబుషేన్ (ఎల్బీ) సిరాజ్ 2; స్మిత్(ఎల్బీ) బుమ్రా 0; హెడ్ (బి) హర్షిత్ 11; మార్ష్ (సి) రాహుల్ (బి) సిరాజ్ 6; క్యారీ (సి) పంత్ (బి) బుమ్రా 21; కమిన్స్ (సి) పంత్ (బి) బుమ్రా 3; స్టార్క్ (సి) పంత్ (బి) హర్షిత్ 26; లియోన్ (సి) రాహుల్ (బి) హర్షిత్ 5; హాజెల్‌వుడ్ (నాటౌట్) 7; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 51.2
ఓవర్లలో 104 ఆలౌట్; వికెట్ల పతనం: 1-14, 2-19, 3-19, 4-31, 5-38, 6-47, 7-59, 8-70, 9-79; బౌలింగ్: బుమ్రా 18-6-30-5; సిరాజ్ 13-7-20-2; హర్షిత్ 15.2-3-48-3; నితీశ్ 3-0-4-0; సుందర్ 2-1-1-0.
భారత్ రెండో ఇన్నింగ్స్: యశస్వి జైస్వాల్ (బ్యాటింగ్) 90; రాహుల్ (బ్యాటింగ్) 62; ఎక్స్‌ట్రాలు: 20; మొత్తం: 57 ఓవర్లలో 172/0; బౌలింగ్: స్టార్క్ 12-2-43-0; హాజెల్‌వుడ్ 10-5-9-0; కమిన్స్ 13-2-44-0; మార్ష్ 6-0-27-0; లియోన్ 13-3-28-0; లబుషేన్ 2-0-2-0; హెడ్ 1-0-8-0.
1
2000 సంవత్సరం తర్వాత ఆస్ట్రేలియాలో అత్యధికంగా 57 ఓవర్లు క్రీజులో నిలిచిన జోడీగా జైస్వాల్-రాహుల్. 2001లో క్యాంప్‌బెల్-హిండ్స్ 53.5 ఓవర్లపాటు ఆసీస్ బౌలర్లను ఎదుర్కొన్నారు.
1
ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాటర్‌గా జైస్వాల్ (34). న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ (33)ను అధిగమించాడు.
2
ఆసీస్ గడ్డపై వరుసగా రెండు సెషన్లు బ్యాటింగ్ చేసిన రెండో భారత జోడీగా జైస్వాల్- రాహుల్. 2018లో మెల్‌బోర్న్‌లో కోహ్లీ- పుజార ఈ ఫీట్ సాధించారు.
Updated Date - Nov 24 , 2024 | 01:26 AM