హర్మన్‌కు పరీక్ష
ABN, Publish Date - Oct 24 , 2024 | 01:56 AM
టీ20 ప్రపంచ కప్‌లో అంచనాలను అందుకోలేకపోయింది హర్మన్‌ప్రీత్ కౌర్ సేన. ఈనేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌పై మన మహిళలు దృష్టి సారించారు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ ద్వారా...
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్
నేడు తొలి పోరు
మ్యాచ్ మ. 1.30 నుంచి స్పోర్ట్స్ 18లో...
అహ్మదాబాద్: టీ20 ప్రపంచ కప్‌లో అంచనాలను అందుకోలేకపోయింది హర్మన్‌ప్రీత్ కౌర్ సేన. ఈనేపథ్యంలో వచ్చే ఏడాది జరిగే వన్డే వరల్డ్ కప్‌పై మన మహిళలు దృష్టి సారించారు. న్యూజిలాండ్‌తో జరిగే మూడు వన్డేల సిరీస్ ద్వారా మెగా టోర్నమెంట్ సన్నాహకాలను ఆరంభించనున్నారు. మొదటి మ్యాచ్ గురువారం జరగనుంది. తదుపరి రెండు వన్డేలకూ అహ్మదాబాదే ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సిరీస్ కెప్టెన్ హర్మన్‌కు ఎంతో కీలకం. కారణం..ఇటీవలి ప్రపంచ కప్‌లో హర్మన్ సారథ్యంలో జట్టు గ్రూప్ దశనుంచే వెనుదిరగడం. పైగా..టీ20 వరల్డ్ కప్ గ్రూప్ ఆరంభ మ్యాచ్‌లో ఇదే న్యూజిలాండ్ చేతిలో భారత్ ఓడడం టోర్నీలో జట్టు అవకాశాలను దెబ్బతీసింది. మరోవైపు న్యూజిలాండ్ ప్రపంచ కప్‌ను కైవసం చేసుకొని ఉత్సాహంతో భారత్‌లో అడుగుపెట్టింది. టీ20 ప్రపంచ కప్‌లో దారుణ వైఫల్యం దరిమిలా హర్మన్ కెప్టెన్సీపై వేటు పడుతుందని అంచనా వేసినా..సెలెక్టర్లు ఆమెపై నమ్మకముంచారు.
పైగా..ఇటీవలి కాలంలో 35 ఏళ్ల హర్మన్ సారథ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇక..కివీ్‌సతో సిరీస్‌కు రిచా ఘోష్, ఆల్‌రౌండర్ ఆశా శోభన అందుబాటులో ఉండడంలేదు. సీమర్ పూజా వస్త్రాకర్‌కు విశ్రాంతి నిచ్చారు. దాంతో పలువురు అన్‌క్యా్‌ప్డ క్రికెటర్లకు జట్టులో చోటు కల్పించారు. ఓపెనర్లు షఫాలీ వర్మ, మంధాన, జెమీమా, కౌర్‌లాంటి స్టార్లంతా పూర్తి స్థాయి ప్రదర్శన కనబరిస్తే తప్ప న్యూజిలాండ్‌ను అడ్డుకోవడం అంత సులభంకాబోదు.
Updated Date - Oct 24 , 2024 | 01:56 AM