ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పోరాడి ఓడిన తెలుగు యోధాస్‌

ABN, Publish Date - Jan 12 , 2024 | 02:05 AM

అల్టిమేట్‌ ఖో-ఖో లీగ్‌ సెమీఫైనల్లో చెన్నై క్విక్‌ గన్స్‌ చేతిలో తెలుగు యోధాస్‌ జట్టు ఓటమి పాలైంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒడిశా జగర్‌నాట్స్‌కు షాకిచ్చిన గుజరాత్‌ జెయింట్స్‌ ఫైనల్‌ చేరింది...

అల్టిమేట్‌ ఖో-ఖో లీగ్‌ ఫైనల్లో చెన్నై, గుజరాత్‌

కటక్‌: అల్టిమేట్‌ ఖో-ఖో లీగ్‌ సెమీఫైనల్లో చెన్నై క్విక్‌ గన్స్‌ చేతిలో తెలుగు యోధాస్‌ జట్టు ఓటమి పాలైంది. మరో సెమీస్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఒడిశా జగర్‌నాట్స్‌కు షాకిచ్చిన గుజరాత్‌ జెయింట్స్‌ ఫైనల్‌ చేరింది. గురువారం జరిగిన రెండో సెమీస్‌ పోరులో చెన్నై క్విక్‌ గన్స్‌పై ఆట ప్రారంభం నుంచి దాదాపుగా చివరి వరకు తెలుగు యోధా్‌సదే పైచేయిగా సాగింది. అయితే చివరి నాలుగు నిమిషాల్లో యోధాస్‌ ఆధిక్యం 26-24కు తగ్గింది. ఆఖరి రెండు నిమిషాల్లో చెన్నై ప్లేయర్‌ రాంజీ మ్యాజిక్‌తో ఆ జట్టు 31-29తో విజయం సాధించింది. అంతకుముందు తొలి సెమీఫైనల్లో గుజరాత్‌ జెయింట్స్‌ 29-27తో ఒడిశాపై నెగ్గింది. ఇక, శనివారం జరిగే మెగా ఫైనల్లో గుజరాత్‌ జెయింట్స్‌తో చెన్నై క్విక్‌ గన్స్‌, మూడో స్థానం పోరులో ఒడిశాతో యోధాస్‌ తలపడనుంది.

Updated Date - Jan 12 , 2024 | 02:05 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising