ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీ20 ప్రపంచ కప్‌లో ఆసీస్‌కు షాక్‌

ABN, Publish Date - Oct 18 , 2024 | 01:50 AM

డిఫెండింగ్‌ చాంప్‌, 8వసారి ఫైనల్‌ బెర్త్‌పై కన్నేసిన ఆస్ట్రేలియాకు మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో షాక్‌ తగిలింది. అనికె బాష్‌ (48 బంతుల్లో 74 నాటౌట్‌) పవర్‌ హిట్టింగ్‌తో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేర్చింది..

ఫైనల్లో దక్షిణాఫ్రికా

దుబాయ్‌: డిఫెండింగ్‌ చాంప్‌, 8వసారి ఫైనల్‌ బెర్త్‌పై కన్నేసిన ఆస్ట్రేలియాకు మహిళల టీ20 వరల్డ్‌క్‌పలో షాక్‌ తగిలింది. అనికె బాష్‌ (48 బంతుల్లో 74 నాటౌట్‌) పవర్‌ హిట్టింగ్‌తో దక్షిణాఫ్రికా ఫైనల్‌కు చేర్చింది. గురువారం జరిగిన సెమీ్‌సలో సౌతాఫ్రికా 8 వికెట్ల తేడాతో కంగారూలను చిత్తుచేసింది. ఆసీస్‌ నిర్దేశించిన 135 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా 17.2 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వన్‌డౌన్‌లో వచ్చిన బాష్‌తోపాటు లారా వొల్వార్డ్‌ (42) కూడా ధాటిగా ఆడారు. కాగా, టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 134 పరుగులు చేసింది. బెత్‌ మూనీ (44) రాణించింది.

  • ఫ విండీస్‌-కివీస్‌ సెమీస్‌ నేడు

వెస్టిండీస్‌, న్యూజిలాండ్‌లు శుక్రవారం జరిగే రెండో సెమీ్‌సలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. 2009, 2010 టోర్నీల్లో ఫైనల్‌ చేరిన న్యూజిలాండ్‌..మళ్లీ తుదిపోరుకు చేరుకోవాలనే పట్టుదలతో ఉంది. 2016లో టైటిల్‌ నెగ్గిన విండీస్‌.. 2018లో సెమీ్‌సకు చేరుకొంది.

Updated Date - Oct 18 , 2024 | 01:50 AM