RCB: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు పేరు మారుస్తున్నారా? మరో హింట్ ఇచ్చిన ఆర్సీబీ..!
ABN, Publish Date - Mar 15 , 2024 | 04:55 PM
ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఎంత మంది గొప్ప ఆటగాళ్లు ఆర్సీబీ తరఫున ఆడినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ జట్టు టైటిల్ గెలవలేదు. అయినా బెంగళూరు ఫ్యాన్స నిరాశపడకుండా తమ జట్టు ఎక్కడ ఆడినా సపోర్ట్ చేస్తూనే ఉంటారు.
ఐపీఎల్‌లోని అత్యంత ప్రేక్షకాదరణ పొందే జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) టీమ్ ఒకటి. విరాట్ కోహ్లీ (Virat Kohli), డుప్లెసిస్ వంటి మంచి హార్డ్ హిట్టర్లతో నిండిన ఆర్సీబీ మ్యాచ్‌లు చూసేందుకు చాలా మంది ఇష్టపడుతుంటారు. ఐపీఎల్ ప్రారంభమైన నాటి నుంచి ఎంత మంది గొప్ప ఆటగాళ్లు ఆర్సీబీ తరఫున ఆడినా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఆ జట్టు టైటిల్ గెలవలేదు. అయినా బెంగళూరు ఫ్యాన్స్ నిరాశపడకుండా తమ జట్టు ఎక్కడ ఆడినా సపోర్ట్ చేస్తూనే ఉంటారు. కాగా, ఈ ఏడాది జరగబోయే సీజన్ (IPL 2024) కోసం ఆర్సీబీ (RCB) సరికొత్తగా సిద్ధమవుతోంది.
ఈ సీజన్ నుంచి ఆర్సీబీ పేరులో మార్పు రాబోతున్నట్టు ఆ జట్టు సోషల్ మీడియా ద్వారా హింట్స్ ఇస్తోంది (RCB Name Change). ఇప్పటికే రిషబ్ షెట్టి ( Rishab Shetty) యాడ్ ద్వారా ఆ విషయమై హింట్ ఇచ్చిన ఆర్సీబీ తాజాగా మరో వీడియో షేర్ చేసింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ ఆటో కనిపిస్తోంది. ఆ ఆటో మూడు చక్రాలపై ``రాయల్``, ``ఛాలెంజర్స్``, ``బెంగళూరు`` అని రాసింది. ఆటో డ్రైవర్ వచ్చి ``బెంగళూరు`` అని రాసి ఉన్న టైరును పీకి పారేసి అర్థమైందా అని అడిగాడు. అసలు విషయం తెలియాలంటే ఈ నెల 19వ తేదీ వరకు ఆగాల్సిందే.
ఆర్సీబీ పేరు ఇంగ్లీష్‌లో ``Royal Challengers Bangalore`` అని ఉండటం గమనించే ఉంటారు. అయితే ఇకపై ``Bangalore``కు బదులుగా ``Bengaluru`` అని రాయబోతున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు ఆర్సీబీ విడుదల చేసిన యాడ్‌లో ``కాంతారా`` ఫేమ్ రిషబ్ షెట్టి.. మూడు దున్నపోతుల దగ్గరకు వచ్చాడు. వాటిలో ఒకదానిపై ``రాయల్``, రెండో దానిపై ``ఛాలెంజర్స్``, చివరిదానిపై ``బెంగళూరు`` అని రాసి ఉంది. రిషభ్ శెట్టి వచ్చి ``బెంగళూరు`` అని రాసి ఉన్న దున్నను అక్కడి నుంచి తీసుకెళ్లమంటాడు. ఆ తర్వాత ``మీకు అర్థమైందా`` అని నవ్వుతూ అడుగుతాడు.
Updated Date - Mar 15 , 2024 | 05:55 PM