పాక్ కొత్త కెప్టెన్ రిజ్వాన్
ABN, Publish Date - Oct 28 , 2024 | 05:24 AM
పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను నియమించారు. బాబర్ ఆజమ్ స్థానంలో వన్డే, టీ20 ఫార్మాట్ పగ్గాలను రిజ్వాన్‌కు అప్పగించారు...
లాహోర్: పాకిస్థాన్ పరిమిత ఓవర్ల కెప్టెన్‌గా వికెట్ కీపర్-బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్‌ను నియమించారు. బాబర్ ఆజమ్ స్థానంలో వన్డే, టీ20 ఫార్మాట్ పగ్గాలను రిజ్వాన్‌కు అప్పగించారు. ఆస్ట్రేలియా, జింబాబ్వేలతో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సల కోసం జట్లను సెలెక్టర్లు ఆదివారం ఎంపిక చేశారు. కాగా, వచ్చే నెలలో ఆసీ్‌సతో జరిగే వన్డే, టీ20ల జట్లలో బాబర్, షహీన్ అఫ్రీది, నసీమ్ షాలకు మళ్లీ చోటుదక్కింది. అయితే, వచ్చేనెల 24 నుంచి డిసెంబరు 5 వరకు జరిగే జింబాబ్వే టూర్‌కు రిజ్వాన్‌తోపాటు కొందరు సీనియర్లకు విశ్రాంతినిచ్చారు. దీంతో ఈ టూర్‌లో వైస్ కెప్టెన్‌గా ఎంపికైన సల్మాన్ అగా జట్టును నడిపించనున్నాడు.
‘బి’ కేటగిరీకి అఫ్రీది: స్టార్ పేసర్ షహీన్ అఫ్రీదికి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు షాక్ ఇచ్చింది. ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్ట్‌లో అఫ్రీదిని కేటగిరి-ఎ నుంచి తప్పించి.. గ్రేడ్-బిలో చేర్చింది. 2024-25 సీజన్‌కు సంబంధించి 25 మందికి సెంట్రల్ కాంట్రాక్ట్‌లు ఇచ్చారు. ఫఖర్ జమాన్, ఇఫ్తికార్ అహ్మద్, ఒసామా మిర్‌లను ఆ జాబితా నుంచి తప్పించారు. పాక్ టెస్ట్ కెప్టెన్ షాన్ మసూద్ కేటగిరి-బిలోనే ఉన్నాడు.
Updated Date - Oct 28 , 2024 | 05:24 AM