కూతకు సిద్ధం!
ABN, Publish Date - Oct 18 , 2024 | 02:01 AM
ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-11 హైదరాబాద్ వేదికగా శుక్రవారం ప్రారంభం కా బోతోంది. తొలి మ్యాచ్‌లో 2018 చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ ...
ప్రొ. కబడ్డీ సీజన్ నేటినుంచే
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ప్రొకబడ్డీ లీగ్ (పీకేఎల్) సీజన్-11 హైదరాబాద్ వేదికగా శుక్రవారం ప్రారంభం కా బోతోంది. తొలి మ్యాచ్‌లో 2018 చాంపియన్ బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ పోటీపడనుంది. గురువారం నగరంలోని ఓ హోటల్లో జరిగిన ట్రోఫీ ఆవిష్కరణలో 12 జట్ల కెప్టెన్లు కప్‌తో ఫొటోకు ఫోజులిచ్చారు. వచ్చే నెల 9 వరకు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో తొలి అంచె పోటీలు, నవంబరు 10 నుంచి నోయిడాలో రెండో అంచె, డిసెంబరు 3 నుంచి 24 వరకు పుణెలో మూడో అంచె జరగనున్నాయి. లీగ్‌లో ప్లేఆ్‌ఫ్సతో సహా మొత్తం 137 మ్యాచ్‌లో జరగనున్నాయి.
గత సీజన్‌లో టైటాన్స్ 22 మ్యాచ్‌ల్లో రెండే గెలిచి అవమానకర రీతిలో లీగ్ నుంచి నిష్క్రమించింది. నిరుడు సీజన్‌లో జట్టు పగ్గాలు తీసుకున్న స్టార్ రైడర్ పవన్ షెహ్రావత్ ఆటగాడిగా రాణించినా సారథిగా టీమ్‌ను విజయపథంలో నడపలేకపోయాడు. అయితే, ఈసారి జట్టులోకి కొత్త ప్లేయర్ల రాకతో పాటు నూతన కోచ్ క్రిషన్ కుమార్ చేరాడు.
Updated Date - Oct 18 , 2024 | 02:01 AM