ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టెస్ట్‌ జట్టులో నితీశ్‌ కుమార్‌

ABN, Publish Date - Oct 26 , 2024 | 05:37 AM

అదిరే బ్యాటింగ్‌తో టీమిండియా టీ20 జట్టులో తన స్థానానికి పూర్తిగా న్యాయం చేసిన తెలుగు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై సెలెక్టర్లకు పూర్తిగా గురి కుదిరినట్టుంది. ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ టెస్ట్‌ సిరీ్‌సకు శుక్రవారం ప్రకటించిన జట్టుకు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌

ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపిక

హర్షిత్‌ రాణాకు చోటు షమి, అక్షర్‌లకు నిరాశ

న్యూఢిల్లీ: అదిరే బ్యాటింగ్‌తో టీమిండియా టీ20 జట్టులో తన స్థానానికి పూర్తిగా న్యాయం చేసిన తెలుగు ఆల్‌రౌండర్‌ నితీశ్‌ కుమార్‌ రెడ్డిపై సెలెక్టర్లకు పూర్తిగా గురి కుదిరినట్టుంది. ప్రతిష్ఠాత్మక బోర్డర్‌-గవాస్కర్‌ టెస్ట్‌ సిరీ్‌సకు శుక్రవారం ప్రకటించిన జట్టుకు పేస్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ నితీశ్‌ను ఎంపిక చేశారు. నితీశ్‌తోపాటు పేసర్‌ హర్షిత్‌ రాణాకు తొలిసారి టెస్ట్‌ జట్టులో చోటు కల్పించింది. 18 మంది సభ్యుల జట్టుకు రోహిత్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. స్టార్‌ పేసర్‌ బుమ్రాను వైస్‌-కెప్టెన్‌గా నియమించింది. దేశవాళీ పోటీల్లో పరుగుల వరద పారిస్తున్న బెంగాల్‌ బ్యాటర్‌ అభిమన్యు ఈశ్వరన్‌కు మూడో ఓపెనర్‌గా స్థానం లభించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ నవంబరు 22న పెర్త్‌లో జరిగే తొలి టెస్ట్‌తో ప్రారంభం కానుంది.

షమికి దక్కని స్థానం: సీనియర్‌ పేసర్‌ మహ్మద్‌ షమికి జట్టులో చోటు దక్కలేదు. ఈ ఏడాది ఆరంభంలో పాదం గాయానికి ఆపరేషన్‌ చేయించుకున్న షమి..తాను ఫిట్‌గానే ఉన్నానని ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పేసర్‌ ఆకాశ్‌దీ్‌ప సింగ్‌ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. బుమ్రా, సిరాజ్‌తో కలిసి అతడు పేస్‌ బౌలింగ్‌ భారాన్ని మోయనున్నాడు. గాయం నుంచి కోలుకోవడంతో పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ జట్టులో పునరాగమనం చేశాడు. స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ గజ్జల్లో గాయం కారణంగా ఎంపికకు అందుబాటులో లేడని బీసీసీఐ తెలిపింది. బ్యాటింగ్‌తోపాటు బౌలింగ్‌లోనూ అద్భుతంగా రాణిస్తున్న స్పిన్నర్‌ వాషింగ్టన్‌ సుందర్‌కూ చోటు దక్కింది. ఫలితంగా మరో స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌పై వేటు పడింది.

టీ20 జట్టులో రమణ్‌దీప్‌, వైశాఖ్‌

సౌతాఫ్రికాతో జరిగే నాలుగు టీ20లకూ టీమిండియాను ప్రకటించారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బ్యాటింగ్‌ ఆల్‌రౌండర్‌ రమణ్‌దీప్‌ సింగ్‌, కర్ణాటక పేసర్‌ వైశాఖ్‌ విజయ్‌ కుమార్‌లకు తొలిసారి జాతీయ జట్టుకు ఎంపికయ్యారు. అలాగే గాయంతో యువ పేసర్‌ మయాంక్‌ యాదవ్‌నూ ఎంపిక చేయలేదు. 15మంది జట్టుకు సూర్యకుమార్‌ నాయకత్వం వహిస్తాడు. నవంబరు 8న డర్బన్‌తో మ్యాచ్‌తో సిరీస్‌ మొదలు కానుంది.

ఆసీస్‌ టూర్‌కు జట్టు: రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), జైస్వాల్‌, ఈశ్వరన్‌, గిల్‌, కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌, పంత్‌ (కీపర్‌), సర్ఫ్‌రాజ్‌, జురెల్‌ (కీపర్‌), అశ్విన్‌, జడేజా, సిరాజ్‌, ఆకాశ్‌దీ్‌ప, ప్రసిద్‌ఽ్ధ హర్షిత్‌ రాణా, నితీశ్‌ కుమార్‌రెడ్డి, సుందర్‌. రిజర్వ్‌: సైనీ, ముకేష్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌.


సఫారీ టూర్‌కు టీ 20 జట్టు సూర్యకుమార్‌

(కెప్టెన్‌), అభిషేక్‌ శర్మ, శాంసన్‌ (కీపర్‌), రింకూసింగ్‌, తిలక్‌ వర్మ, జితేశ్‌ శర్మ (కీపర్‌), హార్దిక్‌, అక్షర్‌, రమణ్‌దీప్‌, వరుణ్‌, బిష్ణోయ్‌, అర్ష్‌దీప్‌, వైశాఖ్‌ విజయ్‌కుమార్‌, అవేశ్‌, యశ్‌ దయాల్‌.

Updated Date - Oct 26 , 2024 | 05:43 AM