న్యూజిలాండ్ 315/9
ABN, Publish Date - Dec 15 , 2024 | 02:41 AM
బ్యాటర్లు రాణించడంతో ఇంగ్లండ్‌తో శనివారం ఆరంభమైన మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో...
ఇంగ్లండ్‌తో మూడో టెస్ట్
హామిల్టన్: బ్యాటర్లు రాణించడంతో ఇంగ్లండ్‌తో శనివారం ఆరంభమైన మూడో టెస్ట్‌లో న్యూజిలాండ్ మెరుగైన స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కివీస్ తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్లకు 315 పరుగులు చేసింది. లాథమ్ (63), విలియమ్సన్ (44), యంగ్ (42) రాణించారు.
గేల్ సరసన సౌథీ
కెరీర్‌లో చివరి టెస్ట్ ఆడుతున్న కివీస్ పేసర్ సౌథీ టెస్ట్ క్రికెట్‌లో ఎక్కువ సిక్స్‌లు కొట్టిన వారి జాబితాలో క్రిస్ గేల్ రికార్డును సమం చేశాడు. ఈ మ్యాచ్‌లో కేవలం 10 బంతులే ఆడి 23 పరుగులు చేసిన సౌథీ అందులో 3 సిక్స్‌లు కొట్టడం విశేషం. ఓవరాల్‌గా 98 సిక్స్‌లు బాదిన సౌథీ.. అత్యధిక సిక్స్‌లు బాదిన వారి జాబితాలో గేల్‌తో సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాడు. స్టోక్స్ (133 సిక్స్‌లు), బ్రెండన్ మెకల్లమ్ (107), గిల్‌క్రిస్ట్ (100) టాప్-3లో ఉన్నారు.
Updated Date - Dec 15 , 2024 | 02:41 AM