ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బీజేపీలో చేరితే.. నిషేధం ఎత్తేస్తారు

ABN, Publish Date - Nov 28 , 2024 | 04:27 AM

తనపై నాలుగేళ్లు నిషేధం విధించడంపై స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా ఘాటుగా స్పందించాడు. తాను కనుక బీజేపీలో చేరితే నిషేధాన్ని ఎత్తేస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. డోప్‌ పరీక్షకు మూత్రం నమూనా...

బజ్‌రంగ్‌ పూనియా

న్యూఢిల్లీ: తనపై నాలుగేళ్లు నిషేధం విధించడంపై స్టార్‌ రెజ్లర్‌ బజ్‌రంగ్‌ పూనియా ఘాటుగా స్పందించాడు. తాను కనుక బీజేపీలో చేరితే నిషేధాన్ని ఎత్తేస్తారని వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడు. డోప్‌ పరీక్షకు మూత్రం నమూనా ఇవ్వకపోడంతో పూనియాపై నాలుగేళ్ల నిషేధాన్ని విధిస్తూ జాతీయ డోపింగ్‌ వ్యతిరేక సంస్థ (నాడా) మంగళవారం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. దీనిపై బజ్‌రంగ్‌ స్పందిస్తూ.. ‘నాడా నిర్ణయంతో షాక్‌కు గురి కాలేదు. ఇది ప్రతీకారం తప్ప మరోటికాదు. నేనిప్పుడు బీజేపీలో చేరితే నాపై నిషేధం ఎత్తివేస్తారు’ అని చెప్పుకొచ్చాడు.

Updated Date - Nov 28 , 2024 | 04:27 AM