తొలిరోజు వర్షార్పణం
ABN, Publish Date - Dec 01 , 2024 | 06:07 AM
ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. భారత్, ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్ జట్ల మధ్య శనివారం నుంచి జరగాల్సిన రెండ్రోజుల పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ తొలిరోజు ఆట...
భారత్‌తో ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్ ప్రాక్టీస్ మ్యాచ్
కాన్‌బెర్రాలో ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్‌తో భారత ఆటగాళ్లు
కాన్‌బెర్రా: ఎడతెరిపిలేని వర్షం కారణంగా.. భారత్, ప్రైమ్ మినిస్టర్స్ లెవెన్ జట్ల మధ్య శనివారం నుంచి జరగాల్సిన రెండ్రోజుల పింక్ బాల్ ప్రాక్టీస్ మ్యాచ్ తొలిరోజు ఆట రద్దయింది. దీంతో ఆదివారం వాతావరణం మెరుగుపడితే 50 ఓవర్ల చొప్పున మ్యాచ్ ఆడడానికి ఇరు జట్లూ అంగీకరించాయి. ఫలితంగా పెర్త్ టెస్ట్‌కు దూరమైన రోహిత్, గిల్‌కు అవసరమైనంత ప్రాక్టీస్ లభించలేదు. ఈనెల 6 నుంచి అడిలైడ్‌లో ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పింక్ బాల్ టెస్ట్ జరగనుంది.
Updated Date - Dec 01 , 2024 | 06:07 AM