ఫేవరెట్ ఆస్ట్రేలియా
ABN, Publish Date - Oct 17 , 2024 | 06:08 AM
వరుసగా మూడుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా నిలుస్తూ టీ20 వరల్డ్ కప్‌లో తిరుగులేని జట్టుగా ముద్ర వేసుకున్న ఆస్ట్రేలియా మహిళలు ప్రతిష్ఠాత్మక టోర్నీలో మరో పోరుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగే సెమీఫైనల్లో సౌతాఫ్రికాను ఢీకొననున్నారు. అయితే గ్రూపు దశలో...
రా.7.30 నుంచి , స్టార్ నెట్‌వర్క్‌లో
దక్షిణాఫ్రికాతో నేడు తొలి సెమీఫైనల్
మహిళల టీ20 వరల్డ్ కప్
దుబాయ్: వరుసగా మూడుసార్లు డిఫెండింగ్ చాంపియన్‌గా నిలుస్తూ టీ20 వరల్డ్ కప్‌లో తిరుగులేని జట్టుగా ముద్ర వేసుకున్న ఆస్ట్రేలియా మహిళలు ప్రతిష్ఠాత్మక టోర్నీలో మరో పోరుకు సిద్ధమయ్యారు. గురువారం జరిగే సెమీఫైనల్లో సౌతాఫ్రికాను ఢీకొననున్నారు. అయితే గ్రూపు దశలో ప్రత్యర్థులపై ప్రదర్శించిన ఆధిపత్యాన్ని చూస్తే..సెమీ్‌సలో ఆస్ట్రేలియా జట్టే నిస్సందేహంగా హాట్ ఫేవరెట్. 2009లో ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభమయ్యాక ఇది తొమ్మిదో వరల్డ్ కప్. కాగా, ఈ టోర్నీలో అన్నిసార్లూ కంగారూలు సెమీఫైనల్‌కు చేరడం విశేషం. ఇక, ఆరుసార్లు ఆస్ట్రేలియా చాంపియన్‌గా నిలిచింది. ఇకపోతే..ఈసారి సెమీఫైనల్ 2023లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన ప్రపంచ కప్ ఫైనల్‌ను గుర్తు తెస్తోంది. నాడు ఈ రెండు జట్లే తుదిపోరులో తలపడగా..19 పరుగులతో కంగారూలు జయకేతనం ఎగురు వేశారు. మహిళల టీ20లలో ఇరుజట్లూ 10 సార్లు పరస్పరం ఢీకొన్నాయి. ఇందులో 9 సార్లు విజేతగా నిలవడం ఆసీస్ సత్తాను తెలియజేస్తుంది. టీ20 ప్రపంచ కప్‌లో దక్షిణాఫ్రికాతో 7సార్లు తలపడిన ఆసీస్ అన్నిసార్లూ గెలిచింది.
రిటైర్మెంట్ ప్రకటించిన మెగ్ లానింగ్ మినహా 2023 మెగా టోర్నమెంట్ ఫైనల్లో ఆడిన అలీసా హీలీ, బెత్ మూనీ, పెర్రీ, మేగన్ షుట్, గార్డ్‌నర్..తదితర 10 మంది క్రికెటర్లు ప్రస్తుత ఆసీస్ జట్టులో ఉన్నారు. మందకొడిగా ఉండే దుబాయ్ పిచ్‌పై ఆడనుండడం బ్యాటింగ్ డెప్త్ ఉన్న ఆస్ట్రేలియాకు కలిసి వచ్చే అంశం. మరోవైపు స్లో లెఫ్టామ్ స్పిన్నర్ ఎంలాబానే దక్షిణాఫ్రికా జట్టుకు తురుపుముక్క. గ్రూపు దశలోని 4 లీగ్ మ్యాచ్‌ల్లో ఆమె 10 వికెట్లు పడగొట్టింది. లారా వోల్వార్ట్, బ్రిట్స్, మరిజానే కాప్ ముగ్గురూ మ్యాచ్ విన్నర్లే. కానీ హీలీ సారథ్యంలో అత్యంత పటిష్టంగా ఉన్న జట్టుపై వారు ఎలా రాణిస్తారనేది కీలకం.
Updated Date - Oct 17 , 2024 | 06:08 AM