ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral Video: ఈమె కథ ఎంతో మందికి స్ఫూర్తి.. కుటుంబ పోషణ కోసం ఆమె స్కూటీ మీద ఏం చేస్తోందో చూడండి..

ABN, Publish Date - Mar 06 , 2024 | 08:41 PM

కాన్పూర్‌కు చెందిన రాధా శర్మ అనే మహిళ ఒంటరిగా కష్టాలను అధిగమించి ధైర్యంగా జీవన పోరాటం చేస్తోంది. ఆమె జీవిత కథ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

కొందరు కష్టాలకు భయపడి పారిపోతే, మరికొందరు కష్టాలను ఎదుర్కొని మరింత బలవంతులుగా మారతారు. తమ కుటుంబ పోషణ కోసం ఏం చేయడానికైనా సిద్ధపడతారు. కాన్పూర్‌కు (Kanpur) చెందిన రాధా శర్మ అనే మహిళ ఒంటరిగా కష్టాలను అధిగమించి ధైర్యంగా జీవన పోరాటం చేస్తోంది. ఆమె జీవిత కథ (Inspirational Story) సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మందికి స్ఫూర్తిగా నిలుస్తోంది. కాన్పూర్ ప్రజలు ఆమెను స్కూటీ దీదీ (scooty wali didi) అని ముద్దుగా పిలుచుకుంటారు.

రాధా శర్మ భర్త కరోనా సమయంలో మరణించాడు. దీంతో ఆమె నిస్సహాయంగా మిగిలిపోయింది. కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. పిల్లలను చదివించడం, వారిని పోషించడం వంటి బాధ్యతలు ఆమె మీద పడ్డాయి. అప్పటివరకు ఇంటికే పరిమితమైన రాధ ధైర్యంగా ముందడుగు వేసింది. ఓ స్కూటీ తీసుకుని దానిని షాప్‌గా మార్చింది. రోడ్డుపక్కన స్కూటీ పార్క్ చేసి మ్యాగీ, ఆమ్లెట్‌, శాండ్‌విచ్‌లు తయారు చేసి అమ్ముతూ కుటుంబాన్ని నడుపుతోంది. ఆ డబ్బులతోనే పిల్లలకు తిండి పెడుతూ వారిని చదివిస్తోంది.

anurag_talks అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. ఈ వైరల్ వీడియోను ఇప్పటివరకు 23 లక్షల మందికి పైగా వీక్షించారు. దాదాపు 3 లక్షల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ స్పందనల తెలియజేశారు. ``మేకప్ వేసుకున్న మహిళల కంటే పోరాడుతున్న మహిళలు అందంగా కనిపిస్తారు``, ``ఎంతో ఉత్తమమైన జీవితం``, ``నేను నీకు హృదయపూర్వకంగా నమస్కరిస్తున్నాను`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 06 , 2024 | 08:41 PM

Advertising
Advertising