ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Snake Video: బాబోయ్.. పాము కాటేస్తే జరిగేది ఇదే.. విషం శరీరంలోకి వెళ్లి రక్తాన్ని ఏం చేస్తుందో తెలుసా..?

ABN, Publish Date - Mar 08 , 2024 | 07:20 PM

పాము విషం రక్తంలో కలిశాక ఏం జరుగుతుందో తెలుసా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో సోషల్ మీడియా జనాలను షాక్‌కు గురి చేస్తోంది.

ఈ ప్రపంచంలో అత్యంత ఎక్కువ మంది భయపడేది పాములకే (Snake). పాము ఉందని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా జంకుతారు. పాము విషానికి (Snake Venom) అంత పవర్ ఉంది. పాము విషం శరీరంలోకి ప్రవేశించాక సమయం గడుస్తున్న కొద్దీ ఒక్కో అవయవం జీవం కోల్పోతుంది. ఆ విష ప్రభావానికి ప్రాణాలు కోల్పోవాల్సిందే. అసలు పాము విషం రక్తంలో కలిశాక ఏం జరుగుతుందో తెలుసా? ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో సోషల్ మీడియా జనాలను షాక్‌కు గురి చేస్తోంది (Snake venom effect on blood).

Learn Something అనే ట్విటర్ హ్యాండిల్‌లో ఈ ప్రయోగాత్మక వీడియోను షేర్ చేశారు. వైరల్ అవుతున్న ఆ వీడియోలో (Viral Video) పామును తీసుకొచ్చి దాని విషాన్ని ఓ గాజు పాత్రలోకి పట్టారు. అనంతరం ఆ విషాన్ని ఓ సిరంజ్‌లోకి ఎక్కించి కేవలం ఓ చుక్కను రక్తంతో నిండిన గ్లాస్‌లో వేశారు. ఆ విషపు చుక్క ప్రభావానికి కొద్ది సెకెన్ల వ్యవధిలోనే ఆ గాజ్ గ్లాస్‌లోని రక్తం గడ్డ కట్టుకుపోయింది (Blood Clot). ఒక్క చుక్క విషం రక్తాన్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది.

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 7.3 లక్షల మందికి పైగా ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు స్పందించారు. ``పాము కాటుకు గురైన వ్యక్తికి సకాలంలో చికిత్స అందకపోతే రక్తం గడ్డకడుతుంది. కీలక అవయవాలు జీవం కోల్పోతాయి``, ``చాలా భయంకరంగా ఉంది``, ``ఇలాంటి విషంతో చాలా మందులు కూడా తయారవుతాయి`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 08 , 2024 | 07:20 PM

Advertising
Advertising