ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Viral: అప్పట్లో మహిళలను అలా చూసే వారు.. ఉద్యోగం కోసం అప్లై చేసిన అమ్మాయికి డిస్నీ ఇచ్చిన రిప్లై ఏంటంటే..

ABN, Publish Date - Feb 14 , 2024 | 04:30 PM

1938వ సంవత్సరంలో వాల్ట్ డిస్నీ ఒక మహిళకు పంపిన రిజెక్షన్ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అప్పట్లో మహిళల పట్ల ఎలాంటి భావన ఉండేదో ఆ లెటర్ కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది.

ప్రస్తుతం పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారు. పరుషులతో పోటీ పడి సంపాదిస్తున్నారు. అయితే కొన్ని దశాబ్దాల క్రితం ఇలాంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఉద్యోగాల విషయంలో మహిళలు తీవ్ర వివక్షను ఎదుర్కొనేవారు. 1938వ సంవత్సరంలో వాల్ట్ డిస్నీ (Walt Disney) ఒక మహిళకు పంపిన రిజెక్షన్ లెటర్ (Job rejection letter) ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ (Viral) అవుతోంది. అప్పట్లో మహిళల పట్ల ఎలాంటి భావన ఉండేదో ఆ లెటర్ కళ్లకు కట్టినట్టు చూపెడుతోంది.

కార్టూన్ చిత్రాలను రూపొందించే వాల్ట్ డిస్నీ సంస్థ ఇంకింగ్, పెయింటింగ్ విభాగంలో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసిన ఫోర్డ్ అనే మహిళను ఉద్దేశించి ఆ లేఖ ఉంది. ``కార్టూన్ చిత్రాలను రూపొందించడంలో మహిళలు ఉపయోగపడరు. వారు సృజనాత్మకంగా పని చేయలేరు. ఆ పనిని యువకులే చేయగలరు. మా కంపెనీలో మహిళలకు ఇచ్చే ఏకైక పని ఏమిటంటే.. సెల్యులాయిడ్ షీట్‌లో అక్షరాలను గుర్తించడం, షీట్‌కు అవతలి వైపు పెయింట్‌తో మార్కులను పూరించడం మాత్రమే. ఆ విభాగంలో ఖాళీలు చాలా తక్కువగా ఉన్నాయ``ని డిస్నీ ప్రతినిధి ఆ లేఖలో పేర్కొన్నారు.

ఈ లెటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ``ఎంతో అభివృద్ధి చెందిన అమెరికాలోనే ఆ పరిస్థితి ఉందంటే.. అప్పట్లో భారతీయ మహిళల పరిస్థితిని ఊహించడానికి కూడా కష్టంగా ఉంద``ని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. ``ప్రస్తుతం డిస్నీ సంస్థలో మహిళలదే కీలక పాత్ర``, ``ప్రస్తుత పరిస్థితుల్లో రిజెక్ట్ అయితే కనీసం సమాచారం కూడా ఉండదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Feb 14 , 2024 | 04:30 PM

Advertising
Advertising