ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Dolly Chaiwala: ఆయన బిల్‌గేట్స్ అని నాకు తెలియదు.. ఏదో ఒకరోజు ఆయనకు కూడా టీ ఇస్తా.. నాగ్‌పూర్ ఛాయ్‌వాలా వ్యాఖ్యలు

ABN, Publish Date - Mar 01 , 2024 | 07:03 PM

తాజాగా డాలీ చాయ్ వాలా టీ షాప్‌నకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ వెళ్లారు. ``డాలీ చాయ్ వాలా`` షాప్‌లో టీ తాగారు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు.

మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో టీ-దుకాణం నడిపే సునీల్ పాటిల్ అనే యువకుడు సోషల్ మీడియాలో చాలా పాపులర్. సూపర్ స్టార్ రజినీకాంత్ తరహాలో అతడి డ్రెస్సింగ్ స్టైల్ ఉంటుంది. అలాగే టీ (Tea) తయారు చేయడం, అందించడంలో కూడా రజినీ స్టైల్‌నే ఫాలో అవుతుంటాడు. కేటీఎం బైక్‌పై వచ్చి స్టైల్‌గా టీ తయారు చేసే సునీల్ ``డాలీ చాయ్ వాలా``(Dolly chaiwala)పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో సెలబ్రిటీగా మారాడు. తాజాగా డాలీ చాయ్ వాలా టీ షాప్‌నకు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ (Bill Gates) వెళ్లారు.

``డాలీ చాయ్ వాలా`` షాప్‌లో బిల్‌గేట్స్ టీ తాగారు. ఆ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశారు. దాంతో సునీల్ పాటిల్ మరోసారి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు. అయితే టీ ఇచ్చేటపుడు తన షాప్‌నకు వచ్చింది బిల్‌గేట్స్ అనే సంగతి సునీల్‌కు తెలియదట. ‘‘ఆయన బిల్‌గేట్స్ అనే సంగతి నాకు తెలియదు. ఎవరో ఫారినర్ అనుకున్నా. అందుకే ఆయనతో నేను పెద్దగా మాట్లాడలేకపోయా. నా పని చేసుకున్నా. తర్వాతి రోజే నాకు అసలు విషయం తెలిసింది. చాలా ఆనందం అనిపించింది. భవిష్యత్తులో ఏదో ఒక రోజు ప్రధాని నరేంద్ర మోదీకి కూడా టీ సప్లై చేయాలనేది నా కోరిక’’ అంటూ సునీల్ పేర్కొన్నాడు.

సునీల్ పాటిల్, బిల్‌గేట్స్ కలిసి ఉన్న వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోపై ఎంతో మంది తమ స్పందనలు తెలియజేశారు. ``ఈ ప్రపంచంలో సునీల్ పాటిల్ అత్యంత అదృష్టవంతుడు``, ``బిల్‌గేట్స్ ఎంత నిరాడంబరంగా వ్యవహరించారో చూస్తే ఆశ్చర్యమేస్తోంది``, ``డాలీ ఛాయ్‌వాలా ఎవరో బిల్‌గేట్స్‌కు తెలుసు. కానీ, బిల్‌గేట్స్ ఎవరో డాలీ ఛాయ్‌వాలకు తెలియదు`` అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 01 , 2024 | 07:36 PM

Advertising
Advertising