ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Funny Video: ఈ కుర్రాడు ఉర్ఫీ జావేద్ తమ్ముడిలా ఉన్నాడు.. వీడియో చూస్తే నవ్వాపుకోలేరు..!

ABN, Publish Date - Mar 12 , 2024 | 04:58 PM

వింత వింత డ్రెస్‌లు, వెరైటీ ఫ్యాషన్ చూస్తే ఎవరికైనా గుర్తుకొచ్చే మొదటి పేరు ఉర్ఫీ జావేద్. ఆశ్చర్యకర డ్రెస్సింగ్ స్టైల్‌తోనే ఉర్ఫీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

వింత వింత డ్రెస్‌లు, వెరైటీ ఫ్యాషన్ చూస్తే ఎవరికైనా గుర్తుకొచ్చే మొదటి పేరు ఉర్ఫీ జావేద్ (Urfi Javed). ఆశ్చర్యకర డ్రెస్సింగ్ స్టైల్‌తోనే ఉర్ఫీ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పటికీ తన సోషల్ మీడియా ఖాతాల్లో అలాంటి ఫొటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. తాజాగా ఓ కుర్రాడు కూడా ఉర్ఫీని మించి ఆలోచించి వెరైటీ డ్రెస్‌తో దర్శనమిచ్చాడు. అతడి స్టైల్ చూస్తే పొట్ట చెక్కలయ్యేలా నవ్వాల్సిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (Urfi Javed`s Brother).

dialog_superstar అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ వ్యక్తి స్టీల్ పాత్రలను (utensils dress) పై నుంచి కింద వరకు డ్రెస్‌లా ధరించాడు. ఛాతీపై ఒక ట్రే, దానిపై ఒక చెంచా పెట్టుకున్నాడు. కాళ్లకు, చేతులకు గిన్నెలు వేసుకున్నాడు. అరచేతులను చెంబుల్లో ఉంచి తలపై ఆర్క్ లాంటి పైపును ధరించి గ్లాస్‌లు వేలాడదీశాడు. విచిత్రంగా నడుస్తూ రజినీకాంత్ సినిమా ``రోబో`` డైలాగ్ చెప్పాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ (Viral Video) అవుతోంది.

ఈ వీడియోకు వేల కొద్దీ వ్యూస్ వచ్చాయి. చాలా మంది ఈ ఫన్నీ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై తమ స్పందనలను ఫన్నీగా తెలియజేశారు. ``ఉర్ఫీ జావేద్ కొత్త వెర్షన్``, `` దీని కారణంగానే కరోనా త్వరగా వెళ్లిపోయింది``, ``ఇతని వల్లే గ్రహాంతరవాసులు భూమిపైకి రావడానికి భయపడుతున్నార``ని నెటిజన్లు కామెంట్లు చేశారు.

Updated Date - Mar 12 , 2024 | 04:58 PM

Advertising
Advertising