Amazon Republic day sale: అమెజాన్‌లో మరో బంపర్ ఆఫర్.. స్మార్ట్ ఫోన్లపై భారీగా డిస్కౌంట్స్!
ABN, Publish Date - Jan 14 , 2024 | 04:20 PM
డిస్కౌంట్స్ కోసం చూస్తున్న వారికి మరో గుడ్ న్యూస్. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌తో ముందుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లతో పాటూ పలు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గ్రృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: డిస్కౌంట్స్ కోసం చూస్తున్న వారికి మరో గుడ్ న్యూస్. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అమెజాన్.. గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌తో (Amazon Great Republic day sale) ముందుకొచ్చింది. స్మార్ట్ ఫోన్లతో పాటూ పలు ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు, గ్రృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్ (Huge discounts) ఆఫర్ చేస్తోంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఈ ఆఫర్‌ల్లో.. స్మార్ట్ ఫోన్లు కొనదలుచుకున్న వారికి పాప్యులర్ స్మార్ట్ ఫోన్లపై (Smart phones) బోలెడన్ని రాయితీలు అందుబాటులో ఉన్నాయి. ఇందులో ముఖ్యమైన టాప్ 6 స్మార్ట్ ఫోన్స్ ఏవో తెలుసుకుని నచ్చిన ఫోన్‌ను మరింత సులభంగా సొంతం చేసుకోవచ్చు.
యాపిల్ ఐఫోన్ 13..
యాపిల్ ఐఫోన్ వాస్తవ ధర 59,900 రూపాయాలు కాగా ఈ ఆఫర్‌లో కేవలం రూ.48,999కే అందుబాటులో ఉంది. పాత ఫోన్ ఎక్సేంజ్ చేసుకుంటే మరింత తక్కువకు ఐఫోన్ 13ను సొంతం చేసుకోవచ్చు. సూపర్ రెటీనా డిస్‌ప్లే, 12 మెగా పిక్సెల్ ప్లస్ 12 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, మరింత ఎక్కువ సేపు చార్జింగ్ ఇచ్చే బ్యాటరీలు ఈ మోడల్‌తో ఉన్నాయి.
సామ్‌సంగ్ గ్యాలెక్సీ ఎస్ 23జీ
దాదాపు రూ. 90 వేల ధరతో మార్కెట్‌లోకొచ్చిన సామ్‌సంగ్ గాలెక్సీ ఎస్ 23 5జీ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ సేల్‌లోని అన్ని డిస్కౌంట్స్ కలుపుకుంటే కేవలం రూ. 54,999కే దక్కించుకోవచ్చు. 256 జీబీ స్టోరేజీ, 8 జీబీ ర్యామ్, స్నాప్ డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉన్న ఈ ఫోన్..వినియోగదారుల ముందున్న మరో మంచి ఆప్షన్
ఆనర్ 90 5జీ
ఆనర్ 90 5జీ ఫోన్‌పై దాదాపు 40 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. అన్ని డిస్కౌంట్స్ కలుపుకుంటే ఈ ఫోన్‌ను కేవలం రూ.28,999కే సొంతం చేసుకోవచ్చు. ఎస్‌బీఐ కార్డ్ డిస్కౌంట్‌తో అదనంగా రూ.2,250ల డిస్కౌంట్ కూడా రెడీగా ఉంది.
పోకో సీ51, టెక్నో పాప్ 8
రూ.10 వేల స్మార్ట్ ఫోన్ కోసం వెతుకుతున్నారా? అయితే, పోకో సీ51, టెక్నో పాప్ 8 మీ ముందున్న మంచి ఆప్షన్స్. ప్రస్తుతం రెండిటిపైనా అమెజాన్‌లో భారీ డిస్కౌంట్స్ అందుబాటులో ఉన్నాయి. అన్ని డిస్కౌంట్స్ కలుపుకుంటే పోకో సీ51ను రూ.5999కు, టెక్నో పాప్ 8ను రూ.5,849కే సొంతం చేసుకోవచ్చు.
రెడ్‌మీ నోట్ 13 5జీ
తొలుత రూ.17,999కు లిస్టైన ఈ ఫోన్‌పై ప్రస్తుతం వెయ్యి రూపాయల వరకూ డిస్కౌంట్ అందుబాటులో ఉంది.
ఐక్యూఓఓ జెడ్7ఎస్ 5జీ
ఐక్యూఓఓ జెడ్7ఎస్ 5జీ అసలు ధర రూ.23,999 కాగా అమెజాన్ సేల్‌లో దాదాపు 38 శాతం డిస్కౌంట్ అందుబాటులో ఉంది. 6.3 ఇంచ్ డిస్‌ప్లే , ఓఐఎస్ ఉన్న 64 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్ ఈ ఫోన్లో ఉన్నాయి.
Updated Date - Jan 14 , 2024 | 04:28 PM