ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆ మొటిమలు ఎందుకు?

ABN, Publish Date - Mar 28 , 2024 | 04:45 AM

డాక్టర్‌! నా వయసు 22 ఏళ్లు. గత కొంత కాలంగా ‘వెజైనల్‌ పింపుల్స్‌’తో బాధపడుతున్నాను. ఇవి ఎందుకొస్తాయి? కారణమేంటి? ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడేదెలా?

డాక్టర్‌! నా వయసు 22 ఏళ్లు. గత కొంత కాలంగా ‘వెజైనల్‌ పింపుల్స్‌’తో బాధపడుతున్నాను. ఇవి ఎందుకొస్తాయి? కారణమేంటి? ఈ సమస్య నుంచి శాశ్వతంగా బయటపడేదెలా?

- ఓ సోదరి, హైదరాబాద్‌

వెజైనల్‌ పింపుల్స్‌కు ఎన్నో కారణాలుంటాయి. అయితే అవి తలెత్తే సందర్భాన్ని బట్టి కచ్చితమైన కారణాన్ని అంచనా వేయవచ్చు. శుభ్రత లోపించడం, లైంగిక వ్యాధులు, నెలసరి సమయంలో ఉపయోగించే ఉత్పత్తులు, ప్యూబిక్‌ హెయర్‌ ఇన్‌ఫెక్షన్‌... వెజైనల్‌ పింపుల్స్‌కు ప్రధాన కారణం. నెలసరి తర్వాత ఈ సమస్య వేధిస్తుంటే, ఆ సమయంలో ఉపయోగిస్తున్న శానిటరీ న్యాప్కిన్లు, ఇతరత్రా నెలసరి ఉత్పత్తులే కారణంగా భావించాలి. లోదుస్తులు శుభ్రంగా ఉంచుకోవడం, వీలైనంత వరకూ గాలి ధారాళంగా ఆడే కాటన్‌ లోదుస్తులు ధరించడం అలవాటు చేసుకోవాలి. వీటితో సమస్య పరిష్కారం కాని సందర్భాల్లో వైద్యులను కలవాలి. ఇన్‌ఫెక్షన్‌ ఉందని తేలితే, వైద్యులు సూచించినంత కాలం నోటి మాత్రలు, పైపూత మందులు వాడుకోవాలి. గాఢమైన సువాసనలు వెదజల్లే పౌడర్లు, వెజైనల్‌ వాష్‌లు ఉపయోగించడం మానుకోవాలి. రాత్రి వేళల్లో లోదుస్తులు ధరించడం మానేయాలి. పగటివేళ బిగుతైన అండర్‌వేర్స్‌, జీన్స్‌ లాంటి వాడకం తగ్గించాలి. ఎక్కువగా చమట పట్టే వీలున్న వేసవి కాలంలో లోదుస్తుల విషయంలో ఎంతో అప్రమత్తంగా వ్యవహరించాలి. సింథటిక్‌ బదులుగా కాటన్‌కే ప్రాధాన్యం ఇవ్వాలి. శానిటరీ న్యాప్కిన్లు ప్రతి నాలుగు గంటలకోసారి మార్చుకుంటూ ఉండాలి. టాంపూన్లు, కప్స్‌ వాడకం మానేయాలి. లైంగిక వ్యాధులు సోకే అవకాశం లేకుండా జాగ్రత్తగా ఉండాలి.

డాక్టర్‌ అమిత్‌ శర్మ,

గైనకాలజిస్ట్‌, హైదరాబాద్‌.

Updated Date - Mar 28 , 2024 | 04:51 AM

Advertising
Advertising