ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వాటిని గెలవాలి!

ABN, Publish Date - Oct 12 , 2024 | 05:36 AM

పురాణపరంగానే కాకుండా సాంస్కృతికంగానూ ప్రాముఖ్యం ఉన్న పండుగ విజయదశమి. చెడుపై మంచి గెలిచిన రోజుగా దసరా పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మానవులు కామ, క్రోద, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు

పురాణపరంగానే కాకుండా సాంస్కృతికంగానూ ప్రాముఖ్యం ఉన్న పండుగ విజయదశమి. చెడుపై మంచి గెలిచిన రోజుగా దసరా పండుగను ఘనంగా నిర్వహిస్తారు. మానవులు కామ, క్రోద, లోభ, మోహ, మద, మాశ్చర్యాలు అనే అరిషడ్వర్గాలను జయించాలనీ, అదే ఈ విజయదశమి పండుగలోని అంతరార్థమనీ పెద్దలు చెబుతారు. విజయదశమి నాడు ఏది ప్రారంభించినా విజయం తథ్యం అనే విశ్వాసం ఉంది.

శమీ శత్రు వినాశినీ...

శమీ వృక్షం (జమ్మి చెట్టు)లో అపరాజితా దేవి కొలువై ఉంటుందని విశ్వాసం. విజయదశమి రోజున అపరాజితా దేవిని శమీవృక్షం వద్ద పూజించే సంప్రదాయం ఉంది. ఉద్భవించిన పవిత్రమైన దేవతా వృక్షాల్లో జమ్మి చెట్టు ఒకటని చెబుతారు. రావణ సంహారానికి ముందు శ్రీరాముడు శమీ వృక్షానికీ, అపరాజితా దేవికీ పూజలు ఆచరించాడని పురాణాలు పేర్కొంటున్నాయి. పాండవులు అజ్ఞాతవాసం ముందు తమ ఆయుధాలను శమీ వృక్షం మీద దాచారనీ, అజ్ఞాతవాసం ముగిశాక వాటిని తిరిగి తీసుకున్నారనీ మహాభారతంలో కథ ఉంది. దసరా నాడు...

శమీ శమయతే పాపం శమీ శత్రువినాశిని

అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని... అనే శ్లోకం పఠించి, జమ్మి చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తే... శత్రు భయం తొలగి విజయం చేకూరుతుందనీ సకల కార్యసిద్ధి కలుగుతుందనీ పెద్దలు చెబుతారు.

శుభప్రదం పాలపిట్ట దర్శనం

దసరా పండుగలో శమీ వృక్షంతో పాటు పాల పిట్టకు ఉన్న ప్రాధాన్యం కూడా ఎక్కువే. పాలపిట్టను పవిత్రంగా భావించడం వెనుక ఉన్న జానపద గాథ ప్రకారం... పాండవులు అరణ్యవాసం, అజ్ఞాతవాసం పూర్తి చేసి తిరిగి వస్తూ ఉండగా, వారికి పాలపిట్ట కనిపించింది. వారు దాన్ని చూసినప్పటి నుంచీ వరుసగా అన్నీ విజయాలే కలిగాయట! అందుకే విజయ దశమి రోజున పాలపిట్టను దర్శించడం శుభప్రదంగా భావిస్తారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో పాలపిట్టను భక్తిప్రపత్తులతో ఆరాధిస్తారు.

Updated Date - Oct 12 , 2024 | 05:36 AM